Home

»

Tv News

Godhavari : గుడిలో పక్కపక్కనే సూర్య, జాను.నిత్య కుట్ర!

Sep 18, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 115 లో... సూర్య జాను కోసం వెతికివెతికి గుడి దగ్గర కూర్చుండిపోతాడు. జాను కూడా అదే గుడికి వచ్చి.. దేవుడా ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు.. డబ్బుపోయింది.. మా చెల్లి హాస్పిటల్ లో ఉంది.. మా చెల్లికి ఏమైనా అయితే ఊరుకునేది లేదని ఏడుస్తూ సూర్య కూర్చున్న స్తంభం వెనకే కూర్చుంటుంది. ఇద్దరు పక్కపక్కనే ఉన్నా ఒకరినొకరు చూసుకోరు. అదే టైమ్ లో నిత్య గుడికి వచ్చి ఇద్దరూ ఒకే చోట ఉండటం చూసి ఫోటో తీసుకొని జాను పని చెప్తానని అనుకుంటుంది. జాను ఇంటికి వెళ్తుంటే నిత్య చెప్పులు తన్నేసి.. కాలికున్న చెప్పులు తంతేనే ఇంత కోపం వస్తే మా బావ వెంట పడితే నాకు ఎంత కోపం వస్తుందని అంటుంది. మీ బావని పెళ్లి చేసుకున్నావ్ కదా ఇంకా నా వెంట పడతావేంటని జాను అనడంతో వారి పెళ్లి ఆగిపోయిన విషయం జానుకి తెలీదని నిత్యకు అర్థమవుతుంది. ఇక్కడే కాదు ఎక్కడా మీ బావని కలవను.. ఊరితో పాటు మీ బావని కూడా వదిలేశానని జాను వెళ్లిపోతుంది.

 

నిత్య వెంటనే సూర్య దగ్గరకు వెళ్లి.. బావ జాను ఈ గుడికి వచ్చింది తెలుసా అనడంతో సూర్య గుడి అంతా వెతుకుతాడు. నిత్య ఇద్దరూ ఒకే చోట కూర్చున్న ఫోటో చూపించి.. తను నిన్ను చూసిందో లేదో, చూసినా చూడనట్లు నటించిందో, ఇన్నాళ్లలో ఎప్పుడూ నీకు ఫోన్ చేయలేదు.. పలకరించలేదు కూడా అంటే తను మారిపోయింది.. నిన్ను మర్చిపోయింది అనే కదా అర్థం.. మిమ్మల్ని దేవుడు కలపాలనుకోవడం లేదు.. ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా ఒకరినొకరు చూసుకోలేదు. నీ డెస్టినీ ఆ జాను కాదు నేను అంటూ బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇక్కడే ఉండి కూడా జానుని ఎలా మిస్ అయ్యానని సూర్య బాధపడి బయటకు వెళ్తాడు.

 

మరోవైపు మురళీ జరిగింది తల్చుకొని బాధగా ఉంటే జాను.. ఇల్లు అమ్మేయమని చెప్పాను కానీ సింహాద్రికి భయపడి ఎవరూ రావడం లేదని చెప్తుండగా ఆ మాటలన్నీ మేడ మీద నుంచి సంజయ్ వింటాడు. రాత్రి జాను హాస్పిటల్ కి వెళ్తుంటే సంజయ్ ఆపి.. నీ చిన్న చెల్లికి ఆపరేషన్ టైంకి డబ్బు లేదు, మీ దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి కదా అని అనడంతో.. ఇది మీకు ఎలా తెలుసని జాను అడుగుతుంది. నీ ప్రాబ్లమ్ కి నేను ఓ సొల్యూషన్ చెప్తా.. మీ చెల్లి ఆపరేషన్ కి డబ్బు నేను ఇస్తానని సంజయ్ అనడంతో జాను చేయి పట్టుకొని థ్యాంక్యూ సో మచ్ అని అంటుంది. ఇటు పారు, శివుడు ఇష్టమైన అమ్మాయి అని చెప్పింది జానునే అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Godhavari, Godhavari Episode 115, Star Maa Serial, Surya, Janu, Nithya, Sanjay, Murali, Simhadri, Telugu Serial]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com