Home

»

Tv News

Jayam serial : విశ్వ ముందు మంచిదానిలా నటిస్తున్న జయ.. ఇంటి వారసుడి కోసం రాఘవ ప్లాన్!

Sep 18, 2026 10:21AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్  జయం. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 376 లో విశ్వ, సుధ ముందు జయ మంచిదానిలా నటిస్తుంది. తను పూజ చేస్తుంటే విశ్వ ఆశ్చర్యంగా చూస్తాడు. విశ్వకి హారతి ఇస్తూ.. ఏంటి నాన్న అలా చూస్తున్నారని జయ అడుగుతుంది. జయ మాట్లాడుతుంటే.. నువ్వు మాట్లాడుతుంటే అచ్చం గంగలాగే అనిపిస్తుందని విశ్వ అంటాడు. ఈ ముసలోడికి ఎంత మంచిగా ఉండాలని ట్రై చేసినా గంగ అనే గుర్తుచేస్తున్నాడని జయ మనసులో అనుకుంటుంది. మరోవైపు గంగ చేసిన పనికి విశ్వ కోపంగా ఉన్నాడు కానీ సర్ కి గంగ అంటే ఇష్టమని పైడిరాజుతో లక్ష్మి అంటుంది.

 

మరోవైపు ప్రీతీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. గంగ హారతి ఇవ్వబోతుంటే శకుంతల అడ్డుపడి.. ఏంటి ప్రతి దానికి నువ్వు వస్తావని కోప్పడుతుంది. అమ్మ నువ్వు ఆగు, గంగనే హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాలని ప్రీతీ అనగానే గంగ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత ప్రీతీకి పుట్టిన బాబు మన వారసుడు కాదు.. మన ఇంటికి వారసుడు రావాలంటే గంగనో ఇషికనో వారసుడిని ఇవ్వాలని రాఘవ అంటాడు. దీంతో .. ఇషిక ఇచ్చినా పర్వాలేదు కానీ ఆ గంగ మాత్రం ఇవ్వకూడదు, వాళ్లని విడగొట్టాలని శకుంతల మనసులో ప్లాన్ వేసుకుంటుంది.

 

ఆ తర్వాత ప్రీతి దగ్గరికి గంగ, రుద్ర వచ్చి బాబుతో సరదాగా ఆడుకుంటారు. అన్నయ్య నా కోసం ఆయన్ని స్టేషన్ నుంచి తీసుకొని వచ్చావ్ కదా అని ప్రీతీ అనడంతో ఈ విషయం నీకెలా తెలుసని రుద్ర అడుగుతాడు. గంగ చెప్పిందని ప్రీతి చెప్తుంది. ఆ మాటలన్నీ వీరు కూడా వింటాడు. ఇంట్లో వారసుడి విషయంలో రాఘవ, శకుంతల వేస్తున్న ప్లాన్స్, జయ నటన చూస్తుంటే గంగకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.

 

ఈ ఎపిసోడ్ లో జయ గంగలా మారి విశ్వ దగ్గర మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేసినా విశ్వ మాత్రం గంగనే తలచుకోవడం.. మరోవైపు ప్రీతి బాబు వారసుడు కాదని రాఘవ అనడం కీలక మలుపులుగా మారాయి. శకుంతల గంగని దూరం పెట్టాలని అనుకోవడం.. ప్రీతికి గంగ సపోర్ట్ గా నిలవడం చూస్తుంటే రాబోయే ఎపిసోడ్ లో గొడవలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Jayam, Jayam Episode 376, Zee Telugu Serial, Jaya, Ganga, Viswa, Sudha, Preethi, Rudra, Shakuntala]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com