Home

»

Tv News

చీరలంటే పిచ్చి.. తరతరాలకు దాచుకుంటా: Vithika sher

Sep 23, 2026 9:56AM

తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి వితికా షేరు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి తన టాలెంట్ తో హీరోయిన్ గా ఎదిగిన ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 11 ఏళ్ల వయసులోనే తెలుగు టీవీ సీరియల్స్ లో నటించిన వితిక, 15 ఏళ్లకే కన్నడ చిత్రం "అంతు ఇంతు ప్రీతి బంతు" ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత "ఉల్లాస ఉత్సా" వంటి కన్నడ చిత్రాల్లో నటించింది. తెలుగులో కీర్తి అనే పేరుతో చిన్న సినిమాలు చేస్తూ, "ఝుమ్మంది నాదం", "భీమిలి కబడ్డీ" జట్టు లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా చేసిన ఆమె సినిమాల్లో తన కాస్ట్యూమ్స్ తనే డిజైన్ చేసుకోవడం ఆమె ప్రత్యేకత.

2013లో వచ్చిన "ప్రేమ ఇష్క్ కాదల్" వితికకు మొదటి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా యూత్ లో బాగా క్లిక్ అయ్యింది. తమిళంలో " ఉయిర్ మొళి" సినిమాలో అంధురాలి పాత్ర కోసం ఏకంగా బ్రెయిలీ లిపి నేర్చుకుని నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. "పడ్డానండి ప్రేమలో మరి", "లక్ష్మీ రావే మా ఇంటికి" వంటి చిత్రాల తర్వాత 2019లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలతో పాటు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా యాక్టివ్ గా కొనసాగుతోంది.

తాజాగా ఒక ఫంక్షన్ కు హాజరైన వితికా షేరుని ఒక ఛానల్ అతను పలు ప్రశ్నలు అడుగగా.. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది వితిక. ఇందులో చీరలపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. నాకు చీరలంటే చాలా ఇష్టం. ఖరీదైన చీరలను కొంటాను. అవి నా తర్వాత తరాలకు కూడా ఉపయోగపడేలా ఉంటాయి. అందుకే కాస్త ఎక్కువ పెట్టి కొంటానని చెప్పింది. తన స్నేహితురాలు నిహారికకు కూడా చాలా చీరలను గిఫ్ట్ గా ఇచ్చానని తెలిపింది.ఫస్ట్ నిహారిక 'బర్త్ డే' కి చీర ఇచ్చిందని, తర్వాత చాలా గిఫ్ట్స్ ఇచ్చినట్టువా వితిక షేరు చెప్పింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-10 చూస్తున్నారా అని అడుగగా.. అంత టైమ్ ఉండటం లేదు.. అసలు టీవీ చూడటం లేదు.. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తున్నానని అంది. కొద్దిగా హెల్త్ బాగోలేకపోవడం వల్లే చూడడం మానేశానని వితిక చెప్పింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com