Home

»

Tv News

Flora Saini Bigg Boss: నెటిజన్ల ఘాటు కామెంట్స్!

Sep 23, 2026 10:21AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-9 లో సెకెండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఒకప్పటి క్రేజీ హీరోయిన్ ఫ్లోరా సైనీ అలియాస్ ఆశా సైనీ. నరసింహ నాయుడు సినిమాలోని 'లక్స్ పాప' పాటతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన ఈ భామ, బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. అసలు పేరు ఆశా సైనీ అయినా, తర్వాత ఫ్లోరా సైనీ గా మారింది. 1999లో ప్రేమ కోసం సినిమాతో తెలుగులోకి వచ్చిన ఆమె, ఆ తర్వాత బాలకృష్ణ, వెంకటేష్, జగపతిబాబు లాంటి స్టార్ హీరోలతో 100కు పైగా సినిమాలు చేసింది.

అయితే కెరీర్ పీక్ లో ఉండగానే ఫ్లోరా జీవితంలో పెద్ద విషాదం జరిగింది. 20 ఏళ్ల వయసులో ప్రముఖ ప్రొడ్యూసర్ గౌరంగ్ దోషితో ప్రేమలో పడింది. కానీ లివ్-ఇన్ లోకి వెళ్లిన వారంలోనే అతని నిజస్వరూపం బయటపడింది. 14 నెలల పాటు చిత్రహింసలు పెట్టాడని, నటన మానేయాలని బలవంతం చేశాడని ఫ్లోరా మీటూ ఉద్యమంలో బయటపెట్టింది. చివరకు తల్లిదండ్రుల దగ్గరకు పారిపోయి ప్రాణాలు కాపాడుకుందని‌ ఇదంతా బిగ్ బాస్ సీజన్-9 కి వెళ్ళే ముందు చెప్పింది ఫ్లోరా.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఫ్లోరా తన ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ తో యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీక్విన్ డ్రెస్ లో, బ్లాక్ డీప్ నెక్ అవుట్ ఫిట్ లో ఉన్న ఫోటోలకు 185, 163 కామెంట్స్ వచ్చాయి. దీనితో పాటు "You can be the finest slice of chocolate cake, and someone will still say no because they're dieting... Stay delicious" అనే కొటేషన్ మరియు "Apparently posting your body is attention seeking. What did you think Instagram was for? Tax Returns?" అనే ఘాటు కొటేషన్ కూడా పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు "Lux Papa still hot", "Queen is back" అంటూ ఫైర్ కామెంట్స్ పెడుతున్నారు, మరికొందరు బోల్డ్ నెస్ పై ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్-9 తర్వాత ఫ్లోరాకు వెబ్ సిరీస్ లలో కొత్త ఆఫర్లు వస్తున్నాయట.

 

 

 

[Flora Saini, Asha Saini, Bigg Boss Telugu 9, Lux Papa, Narasimha Naidu, Flora Saini Instagram, Flora Saini Photos, Flora Saini Bold Look, Telugu Cinema, Bigg Boss Telugu]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com