Home

»

Tv News

కిల్లర్ మూవీపై జ్యోతి పూర్వజ్ క్లారిటీ.. రూల్ కాదు, పర్ఫామెన్సే!

Sep 23, 2026 9:49AM

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జగతి మేడమ్ గా సుపరిచితమైన నటి జ్యోతి పూర్వజ్ అసలు పేరు జయశ్రీ రాయ్. కన్నడలో పుట్టి, తెలుగు, కన్నడ సీరియల్స్ లో 20కి పైగా సీరియల్స్ చేసిన ఆమెకు గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బ్రేక్ ఇచ్చింది. రిషి తల్లిగా, తన కంటే వయసులో పెద్ద పాత్ర అయినా ఛాలెంజ్ గా తీసుకొని నటించి తెలుగు ఇంటింటా ఫేమస్ అయ్యారు.జ్యోతి మొదట్లో కన్నడ సినిమాలు సీతారామ కళ్యాణ, గంధద గుడి, 99, దియా వర్ణపటల వంటి చిత్రాల్లో నటించారు. తన 20 ఏళ్ళ వయసులో పద్మనాభ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత విడిపోయారు. తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ (పూర్వాజ్) తో ప్రేమలో పడి, ఆయన పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని జ్యోతి పూర్వజ్ గా మారారు.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో Ask me a question సెషన్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది జ్యోతిరాయ్. రోల్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారని ఒకరు అడుగగా.. Content Under current emotions, Presentation, Priority అని రిప్లై ఇచ్చింది. ఫేవరేట్ క్రికెటర్ అంటే 2:15 అని టైమ్ తో హింట్ ఇచ్చారు. మిమ్మల్ని రోమ్-కామ్ లో చూడాలని ఉందని ఒక అభిమాని అడుగగా.. KilleR got that, Partly అని రిప్లై ఇచ్చింది. అక్టోబర్ 30 నుండి సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేస్తారా అని ఒకరు అడుగగా.. It's never about ruling, it's about performing అని రిప్లై ఇచ్చింది. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ జరుగుతున్నాయని, U/A వస్తుందని, అక్టోబర్ 17న థియేటర్లలో, అదే రోజు USA ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతుందని, త్వరలో USA ప్రమోషన్స్ కి వస్తానని ఆమె కన్ఫర్మ్ చేసింది.

జ్యోతి ఇప్పుడు బుల్లితెర నుండి వెండితెరపైకి Killer అనే సైన్స్ ఫిక్షన్, యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ తో వస్తున్నారు. దీనికి భర్త పూర్వజ్ దర్శకత్వం వహించగా, జ్యోతి Dream Girl గా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఉంటుందని టీజర్ వైరల్ అయ్యింది.

 

 

 

[Jyothi Poorvaj, Jyothi Ray, Guppedantha Manasu, Jagathi Madam, Killer Movie, Poorvaj, Telugu Serials, Kannada Serials, Killer Movie Release, Dream Girl]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com