అన్ స్టాపబుల్.. ఐదో ఎపిసోడ్ కి నలుగురు దిగ్గజాలు
on Nov 30, 2022
'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమవుతోంది. మొదటి సీజన్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ ని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే రెండో సీజన్ నుంచి నాలుగు ఎపిసోడ్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్న ఈ ఎపిసోడ్లు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఐదో ఎపిసోడ్ కోసం టాలీవుడ్ కి చెందిన నలుగురు దిగ్గజాలను రంగంలోకి దించడం విశేషం.
ఐదో ఎపిసోడ్ లో సందడి చేసే గెస్ట్ ల వివరాలను తాజాగా ఆహా పంచుకుంది. బడా నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబుతో పాటు సీనియర్ దర్శకులు రాఘవేంద్ర రావు, కోదండరామి రెడ్డి సందడి చేయనున్నారని తెలుపుతూ వారు షో షూటింగ్ లో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఈ ఎపిసోడ్ డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా షోకి ఎవరు వచ్చినా వారితో సరదాగా కలిసిపోతూ వినోదాన్ని పంచుతున్నాడు బాలయ్య. మరి ఇప్పుడు ఈ సీనియర్లతో ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.