రీసెంట్ గా పుష్ప చూసా కానీ...ఆ హీరో ఎవరో తెలీదు
on Nov 30, 2022
అల్లు అర్జున్ నటించిన "పుష్ప" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దుమ్మురేపిన సినిమా ఇది. ఇక ఇందులో "పుష్ప రాజ్" అలియాస్ హీరో అల్లు అర్జున్ గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు. కానీ ఆవిడకి మాత్రం ఆయనెవరో తెలియదట. ఎవరామె అనుకుంటున్నారా ? ఆమె ఎవరో కాదు ఒకప్పుడు వెండితెరపై డాన్సింగ్ ఐకాన్ గా నిలిచిన హీరోయిన్ విజయలక్మీ. "ఆలీతో సరదాగా" షోలో నెక్స్ట్ వీక్ ఈమెతో చిట్ చాట్ ప్లాన్ చేశారు ఆలీ. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈమె ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో ఒక స్టార్ గా ఎదిగిన హీరోయిన్.
ఇక ఈ షోలో "ఇప్పటి జనరేషన్ మూవీస్ ఏమన్నా చూస్తున్నారా అప్పుడప్పుడైనా" అని అడిగేసరికి రీసెంట్ గా "పుష్ప" చూసాను అని చెప్పారు విజయలక్ష్మి. మరి "ఆ సినిమాలో చేసిన అబ్బాయి తెలుసు కదా ఎవరో" అనేసరికి ఆమె " తెలీదు" అన్నారు. "ఆయన అల్లు రామలింగయ్య గారి మనవడు" అని చెప్పారు ఆలీ. ఆ మాటకు అవునా అని ఆశ్చర్యపోయారు విజయలక్ష్మి. ఇప్పుడు ఏ హీరో గురించి అడిగినా రామానాయుడు మనవడు, ఎన్టీఆర్ మనవడు అంటున్నారు అని అన్నారు. ఇక ఎన్టీ రామారావు గారు తనను "కోడలా కోడలా" అని పిలిచేవారని...నిద్రపోయేటప్పుడు క్లాప్ అని సౌండ్ వినిపిస్తే చాలు రెడీ అని లేచి కూర్చునేదాన్ని అని చెప్పుకొచ్చారు విజయలక్ష్మి.
Also Read