రేవంత్ వైఫ్ ఎమోషనల్ ఇంటర్వ్యూ!
on Nov 30, 2022
బిగ్ బాస్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న రేవంత్ భార్య ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ మొదలైన రోజునే నాగార్జునతో స్టేజ్ మీద కన్పించింది. ఇంకా తన శ్రీమంతం వీడియోని బిగ్ బాస్ టీవీ లో చూపించడంతో రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. కాగా రేవంత్ వైఫ్ అన్విత మొదటిసారిగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇంటర్వ్యూలో యాంకర్, అన్వితని రేవంత్ ఆట తీరు గురించి అడుగగా "తను బాగా ఆడుతున్నాడు. అందరూ తనని అగ్రెసివ్ అంటారు. కానీ అతను చాలా స్వీట్ పర్సన్. కోపం వచ్చినా కానీ అది కొద్దిసేపే, ఆ తర్వాత మళ్ళీ మాములే. హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ కి హెల్ప్ చేస్తున్నాడు. రేవంత్ ది చిన్న పిల్లల మనస్తత్వం." అని చెప్పింది. "హౌస్ లో ఫుడ్ ఎక్కువ తింటాడు అంటూ హౌస్ మేట్స్ చెప్పినప్పుడు మీకేమనిపించింది?" అని యాంకర్ అడుగగా, "ఫుడ్ ఎంత తీసుకుంటున్నాడో అనే చూస్తున్నారు. కానీ ఆ ఫుడ్ ఎంత మందికి షేర్ చేస్తున్నాడో? ఎవరూ కూడా చూడట్లేదు" అంటూ చెప్పింది. "రేవంత్.. ఈ సమయంలో మీ దగ్గర లేడు. మీరు బాధ పడుతున్నారా?" అని అడగటంతో, "నాకంటే ఎక్కువ బాధ తనకే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నన్ను చూసుకోవడానికి అందరు ఉన్నారు. మళ్ళీ నేను రేవంత్ ని రోజు చూస్తున్న కానీ రేవంత్ నన్ను చూడట్లేదు కదా" అని అంది.
ఇక హౌస్ మేట్స్ గురించి యాంకర్ అడుగగా, "అందరూ బాగా ఆడుతున్నారు. కోపం అనేది పర్టికులర్ గా ఆ సిచ్యువేషన్ వరకే. లోపల జరుగుతుందో మనకు తెలియదు కదా. అన్ని పరిస్థితులకు తగ్గట్టు ఉంటేనే ఉండగలుగుతాం." అని చెప్పింది. "హౌస్ లో మీ ఫేవరెట్ ఎవరు" అని అనగా, "నాకు గీతు ఫేవరెట్ కానీ తాను వెళ్లిపోయింది. ఇప్పుడు రేవంత్ నా ఫేవరేట్. తనే టాప్ ఫైవ్ లో ఉంటాడు.. ఇంకా విన్నర్ కూడా అవుతాడు" అని చెప్పుకొచ్చింది.