.webp)
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇందులో దొరబాబు, ధనరాజ్ , గాలిపటాల సుధాకర్ ఇలా ప్రతీ ఒక్కరి స్కిట్ వేరే లెవెల్ లో ఉండబోతోంది. ధనరాజ్ స్కిట్ లో రష్మీ వయసు మీద కామెంట్స్ చేసాడు. "రష్మీ నీకు కుక్కలంటే బాగా ఇష్టమంట కదా. " అన్నాడు ధనరాజ్. "ఐ లవ్ డాగ్స్. ఐ హగ్ డాగ్స్, ఐ కిస్ డాగ్స్ " అంది చాలా జోష్ తో. వెంటనే ధనరాజ్ "ఈ రోజు నుంచి నన్ను మనిషిలా చూడకు కుక్కలా చూడు " అన్నాడు . దాంతో జడ్జెస్ నవ్వేశారు. మళ్ళీ ధనరాజ్ "నాకు ఒక కుక్క ఉండేది. పోయిన పుష్కరాల్లో తప్పిపోయింది మేడం " అన్నాడు "అయ్యో " అని బాధపడింది రష్మీ. "నువ్వు ఎన్ని పుష్కరాలు చూసావ్ " అన్నాడు మళ్ళీ ధనరాజ్ . "నాలుగు పుష్కరాలు " అంది . "నాలుగు పుష్కరాలు అంటే 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి నీ వయసు 48 ఏళ్ళు కదా " అన్నాడు. దాంతో ఛీపో అంది రష్మీ కామెడీగా. తర్వాత జడ్జ్ ఇంద్రజాని అడిగాడు "మీరెన్ని పుష్కరాలు చూసారు " అని. ఇక ఇంద్రజ చిన్నపిల్లలా ఫేస్ పెట్టి "పుష్కరాలు అంటే ఏంటి ధనరాజ్ గారు " అని అమాయకంగా అడిగారు. ఇక ధనరాజ్ కి నోటమాట రాలేదు.
తర్వాత దొరబాబు స్కిట్ లో గాలిపటాల సుధాకర్ కామెడీ మాములుగా లేదు. దొరబాబుకు కళ్ళు లేకపోతే అతన్ని చూసుకోవడానికి సుధాకర్ వచ్చి అమ్మాయి గొంతుతో మాట్లాడ్డం అలాగే "దరికి రాబోకు రాబోకు " అనే సాంగ్ పాడడం చూసి జడ్జ్ నాగబాబు రియాక్ట్ అయ్యారు. "దొరబాబు ఈ పాత్రలో బాగా జీవించాడు. దరికి రాబోకు సాంగ్ నర్తనశాల మూవీ లో ఎస్వీ రంగారావు , సావిత్రి గారు చేసారు. " అని చెప్పారు. "కొన్ని ఊళ్ళల్లో రాబాకు పోబాకు అంటుంటారు సర్ " అని దొరబాబు అనేసరికి "అది నీకైతే కరెక్ట్ గా సెట్ అయ్యిందిరా " అన్నారు నాగబాబు. "అందరి ముందు పొగడకండి సర్ సిగ్గేస్తోంది " అంటూ కామెడీ డైలాగ్ వేసాడు. ఇక నెటిజన్స్ ఐతే నరేష్, రామ్ ప్రసాద్ ఎక్కడ, చంటి అన్న వెల్కమ్, బులెట్ భాస్కర్ లేకపోతె మేము చూడలేము అని కామెంట్స్ చేస్తున్నారు.




.webp)
.webp)
