.webp)
అనసూయ సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా అది వైరల్ ఐపోతుంది ...అంతే కాదు ఆ కామెంట్స్ మీద డిబేట్స్ జరుగుతాయి. అక్కడితో కూడా ఆగకుండా ట్రోల్ చేయడం ... అనవసర మాటలు మాట్లాడ్డం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఒక్క అనసూయ మీదనే కాదు మరో వైపు రష్మీ, ఇంకో వైపు చిన్మయి శ్రీపాద వీళ్ళ మీద కూడా ట్రోలింగ్స్ , కామెంట్స్ ఎన్నో సందర్భాల్లో వస్తూనే ఉంటాయి. కొందరు బూతులు తిడతారు కొందరు సపోర్ట్ చేస్తారు. రీసెంట్ గా అనసూయ బొట్టు, గాజులు గురించి ఒక రీల్ చేసి పోస్ట్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో టాప్ రేటింగ్ లో ట్రోలింగ్ అయ్యింది.
ఐతే ఇప్పుడు అనసూయ మరో ఫన్నీ రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అది హేటర్స్ కి చెంపపెట్టులా ఉండాలని చేసినట్టు తెలుస్తోంది. కిచెన్ రూమ్ లో వంట చేస్తూ పక్కకెళ్లి తుమ్మింది . "ఈ అనసూయకు అసలు సిగ్గుందో లేదో తుమ్మింది, ఈ అనసూయకు అసలు సిగ్గుందో లేదో బుద్ది లేనే లేదసలు ఆవలిస్తోంది... దేవుడా ఈరోజు డిబేట్ లోకి ఎవరొస్తారో మాట్లాడ్డానికి... నేను తుమ్మాను... ఆవలించాను . మీరు మీరు కొట్టుకుని చావండి నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఆ ఇంకో విషయం మర్చిపోయాను... ఈ అనసూయకు అసలు సినిమాలు లేనట్టున్నాయి. మేమే పెద్ద ఘనకార్యం చేసాం. షాప్ ఓపెనింగ్ ఆపించేశాం. పనీ పాట లేకుండా తుమ్ముతోంది... ఆవలిస్తోంది... దగ్గుతోంది... మొహం కడుక్కుంటోంది..." ఛి ఎం మనుషులురా మీరు అన్నట్టుగా ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ఆ రీల్ లో.
ఈ రీల్ మీద నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "నిజమే అనసూయ గారు! నిన్న మీరు మీ అమ్మగారి గురించి బాధ పడుతూ పెట్టిన పోస్ట్ గురించి ఎన్ని వీడియోస్ చేస్తున్నారు , డిబేట్ లు పెడుతున్నారు... ఒక్క బాధ షేర్ చేసినందుకు ఇంతా? కానీ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు . ఉండాలి కూడా! నిన్న మీరు మాట్లాడిన దాంట్లో తప్పేముంది! కూతురిగా మీ బాధను పంచుకున్నారు అంతే కదా! ఎవరికి ఏం తోస్తే అది రాస్తూనే ఉంటారు... ఎందుకు జనం ఇలా అయ్యారో అర్థం కావడం లేదు. సూపర్ అనసూయ. ఫాన్స్ కి జనాల విషయంలో చాలా బాగా రియాక్ట్ అవుతున్నావు. పరిస్థితులని మేనేజ్ చేసే కేపబిలిటీ కూడా ఉండాలి " అంటున్నారు.




.webp)

