TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

కౌన్ బనేగా కరోడ్ పతి షోతో సమానంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష దూసుకెళ్తోంది

Aug 26, 2026 4:32PM

బుల్లితెర మీద బిగ్ బాస్ అగ్నిపరీక్ష దుమ్ము రేపుతోంది. పాజిటివ్ ట్రోలింగ్ కంటే నెగటివ్ ట్రోలింగ్ తో టాప్ పొజిషన్ లో నిలిచి ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఐతే సీరియల్స్ విషయానికి వస్తే ఏ సీరియల్ టాప్ రేటింగ్ లో  నిలుస్తోంది అనేది వీక్లీ రిపోర్ట్ ఎలా వస్తుందో ఇప్పుడు ఓటిటి షోస్ , మూవీస్ విషయంలో కూడా ఆడియన్స్ ఎంత టైం చూసారు ఏ షో టాప్ లో కొనసాగుతోంది అనే వివరాలను అందిస్తోంది ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ మీడియా  సంస్థ . రీసెంట్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది.

ఆడియన్స్ ట్రాకింగ్ ఆధారంగా  2026 ఆగస్టు 17-23 వరకు ఈ వారాంతంలో ఇండియన్ ఓటిటిలో   అత్యధికంగా వీక్షించిన  టాప్ 10 కంటెంట్ లిస్ట్ ని ఈ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా స్తానం సంపాదించుకుంది. అది కూడా లెజండరీ హీరో అమితాబచ్చన్ చేసిన రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి షోతో సమానంగా ఈ షో రేటింగ్ ని సంపాదించుకుంది. ఈ విషయాన్నీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జి నవదీప్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు.

ఓర్మాక్స్ మీడియా అంటే తెలుగు OTT ఆడియన్స్ ట్రాకర్. ప్రతీ వారం ఈ మీడియా సంస్థ ఆడియన్స్ ట్రాకర్ ద్వారా భారతదేశంలోని OTT ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువగా చూసే తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ కంటెంట్ వివరాలను అందిస్తూ ఉంటుంది . ఇందులో సోమవారం నుంచి ఆదివారం వరకు  ఏ షో టాప్ లో ఉందో ఆడియన్స్ ఎక్కువగా ఎం చూస్తున్నారో ట్రాక్ చేస్తుంది.  ఒక వ్యక్తి ఒక కంటెంట్‌ను కనీసం 30 నిమిషాలు చూస్తే అక్కడి నుంచి ఆ షో ట్రాకింగ్  మొదలవుతుంది.  ఈ ట్రాకర్‌లో తెలుగు ఆడియన్స్  ఏ షో,   ఏ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలను ఎక్కువగా చూస్తున్నారో తెలుసుకోవచ్చు.
ఈ ట్రాకింగ్ న్యూస్ అటు ప్రొడ్యూసర్స్ కి,  OTT ప్లాట్‌ఫామ్‌లు, యాడ్స్ ఇచ్చేవాళ్లకు  చాలా ఉపయోగపడుతుంది.  తెలుగు ప్రేక్షకుల OTT వినియోగాన్ని హిందీ, ఇతర ప్రాంతీయ భాషల ప్రేక్షకులతో కూడా పోల్చి చూస్తుంది.  గత వారం డేటా ఆధారంగా ఈ షో ట్రాకింగ్  వివరాలను ప్రతి మంగళవారం విడుదల చేస్తారు. ఈ డేటాను సేకరించేందుకు ఓర్మాక్స్ మీడియా ఆన్‌లైన్ సర్వేలు, రోజువారీ OTT ప్రేక్షకుల ప్యానెల్స్, భారతదేశంలోని మొత్తం స్ట్రీమింగ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆధారంగా అంచనాలు వేస్తుంది.  ఓర్మాక్స్ మీడియా ముంబై కేంద్రంగా పని చేస్తుంది.  ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన కన్సల్టింగ్ , ఆడియన్స్ రీసెర్చ్ సంస్థ. మీడియా , వినోద రంగంలో ప్రేక్షకులు ఏ  కంటెంట్‌ ను ఎక్కువగా ఆదరిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు.  

google-ad-img