TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Temper Vamsi: బిగ్ బాస్ నుంచి టెంపర్ వంశీ ఎలిమినేటెడ్!

Nov 29, 2026 12:47PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 దాదాపు చివరకొచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి వంశీని బయటకు పంపేశాడు నాగార్జున. నిన్నటి ఎపిసోడ్ లో అమన్, ముఖేష్ కి ఇచ్చిపడేశాడు నాగార్జున. త్రిగుణ్-వర్షిణి గొడవని సెటిల్ చేశాడు.

వీకెండ్ కావడంతో హౌస్‌లోకి వచ్చిన నాగార్జున.. ఈ వారం ఆట గురించి జడ్జిమెంట్ ఇస్తూనే ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడు. హౌస్‌లోని ప్రస్తుత పరిస్థితి గురించి నాగ్ అడిగిన ప్రశ్నకు వర్షిణి కన్ఫెషన్ రూమ్‌లో ఎమోషనల్ అయిపోయింది. ఈ వారం ఏం జరిగిందని నాగార్జున అడగ్గా తొమ్మిది మంది ఒకవైపు, ఇద్దరం ఒకవైపు ఉన్నట్లుగా అనిపిస్తోందని.. గ్యాంగ్‌గా ఏర్పడ్డారని, తమకు సపోర్ట్ రావడం లేదని బాధపడింది. ఏ విషయంలో అలా జరిగిందని ప్రశ్నించగా.. క్యారెక్టర్ విషయంలోనే ఆ పాయింట్ వచ్చిందని వర్షిణి చెప్పింది. 

త్రిగుణ్ ఏమన్నాడని నాగార్జున అడగ్గా.. "చీప్ క్యారెక్టర్ నీది" అన్నాడని వర్షిణి ఏడుస్తూ చెప్పింది. ఫ్రెండ్‌షిప్ విషయంలో అన్నానని తర్వాత వివరణ ఇవ్వలేదా అని నాగార్జున అడగ్గా, ఫ్రెండ్‌షిప్ విషయంలో అన్నానని చెప్పలేదని వర్షిణి సమాధానం ఇచ్చింది. వీడియో ఫుటేజ్ ప్లే చేసిన తర్వాత త్రిగుణ్ ఏ ఉద్దేశంతో అన్నాడో క్లారిటీ వచ్చిందా అని నాగ్, వర్షిణిని అడిగాడు. త్రిగుణ్‌ని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగ్.. ఫ్రెండ్‌షిప్‌కు విలువ ఇవ్వని క్యారెక్టర్ అని తను గురించి నువ్వు అనుకున్నట్లే, తను కూడా సరిగ్గా అదే అనుకుందని చెప్పాడు.

కెప్టెన్ అమన్‌తో మాట్లాడిన నాగార్జున.. కెప్టెన్ అయిన తర్వాత  కంట్రోల్ తప్పావా అని సీరియస్ అయ్యాడు. మనిషి క్యారెక్టర్ టాప్ పొజిషన్‌లో, చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడే తెలుస్తుందని, ఆ ప్రవర్తన ఏంటో అదే ఒరిజినల్ క్యారెక్టర్ అని నాగార్జున అన్నాడు. వీడియో వేసి మరీ అమన్ చేసిన పనులను ఎత్తి చూపించాడు. ముఖేష్ ని రకరకాల పేర్లతో పిలవడం గురించి కూడా అమన్ కి నాగ్ క్లాస్ పీకాడు.

చివరకు డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా మొదట టెంపర్ వంశీ ఎలిమినేట్ అయ్యాడు. వంశీ ఎలిమినేషన్ అవ్వడంతో అందరు ఎమోషనల్ అయ్యారు. ‌ముఖ్యంగా త్రిగుణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే వారి బాండింగ్ అలాంటిది మరి. అందరికి బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన వంశీకి తన జర్నీవీడియోని చూపించాడు నాగార్జున. 

ఆ తర్వాత హౌస్ లో ఉన్నవారిలో ఎవరికి ఏ విలన్ రోల్ సెట్ అవుతుందో చెప్పమన్నాడు నాగార్జున. ముఖేష్ కి పుష్ప సినిమాలోని విలన్ బన్వర్ సింగ్ శిఖావత్ రోల్ ఇచ్చాడు వంశీ. ఆ తర్వాత నీలాంబరి రోల్ త్రిగుణ్ కి ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరొకి ఒక్కో రోల్ ఇచ్చాడు వంశీ. ఆ తర్వాత అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోయాడు వంశీ.‌ ఇలా హౌస్ లో టెంపర్ వంశీ క్యారెక్టర్ ఎలిమినేషన్ అయింది. 

 

google-ad-img