Bigg Boss 10 Telugu: ముఖేష్ కి క్లాస్ పీకిన నాగార్జున.. స్నేక్ టాస్క్ లో తప్పు ఎవరిది?
Nov 29, 2026 12:40PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 వీకెండ్ లో నాగార్జున ముఖేష్ కి స్ట్రాంగ్ క్లాస్ పీకాడు. ముఖేష్ తో మాట్లాడుతూ నీకు స్టార్ డమ్ ఉందని నాగార్జున అనగా.. కాదని ముఖేష్ సమాధానం ఇచ్చాడు. దీనికి నాగార్జున "నేను చెప్తున్నాను, నువ్వు స్టార్ వు, నీకు స్టార్ డమ్ ఉంది" అని స్పష్టం చేశాడు.
అంతేకాదు ముఖేష్ బట్టలు తీసి స్విమ్మింగ్ పూల్ లో పడేసిన ఘటనపై వర్షిణిని అడగ్గా, తన బట్టలు కూడా దాంట్లో ఉన్నాయని, 24 అవర్స్ అవ్వకుండానే పడేశాడని చెప్పింది.
దీనిపై ముఖేష్ ని ఉద్దేశించి నాగార్జున.. నిన్ను బోలెడంత మంది ఇష్టపడేవాళ్లు ఉన్నారని, కానీ నువ్వు ఆడే తీరు, ప్రవర్తన మూలాన వాళ్లకు ఇష్టం పోతుందని, స్టార్ డమ్ పోతుందని చెప్పాడు. అలాగే ముఖేష్ మీద ఎందుకు అంత ద్వేషం, అంత బాగా ఆడుతుంటే ఆ రౌండ్ క్యాన్సిల్ చేశావని త్రిగుణ్ ని కూడా నాగార్జున ప్రశ్నించాడు.
ఇక ఎపిసోడ్ లో స్నేక్ టాస్క్ గొడవ కూడా హైలైట్ అయింది. స్నేక్ టాస్క్ లో ఎవరు బాగా ఆడారని నాగార్జున అడగ్గా త్రిగుణ్ అని అమన్ చెప్పాడు. అయితే బాగా ఆడిన త్రిగుణ్ అయితే ఆర్కే ఎలా గెలిచాడని నాగార్జున ప్రశ్నించాడు. కింద పడ్డ బాక్స్ ని గుంజుకోవచ్చు, లాక్కోవచ్చని అమన్ చెప్పగా, కింద పడిన తర్వాతే దాని దగ్గరికి వెళ్లాలని వీడియో చూపించి తప్పు పట్టాడు.
అలాగే బాల్ ని బాస్కెట్ లోపల ప్రొటెక్ట్ చేసుకునే అంశంపై ఆర్కే స్పందిస్తూ, అతను లాగడం వల్ల అలా వచ్చేసింది తప్ప బాస్కెట్ లాగి బాల్ తీయాలని ఉద్దేశం లేదని చెప్పాడు. వర్షిణి నువ్వు సంఛాలక్ అయితే ఏం డెసిషన్ తీసుకుంటావని నాగార్జున అడగ్గా.. బాస్కెట్ తీసింది మాత్రం ఫౌల్ ఇస్తానని సమాధానం ఇచ్చింది. దీంతో స్నేక్ టాస్క్ లో ఫౌల్స్ పై క్లారిటీ వచ్చింది.




