TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Temper Vamsi: టెంపర్ వంశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Nov 29, 2026 12:59PM

బిగ్ బాస్ సీజన్-10 తెలుగు పన్నెండో వారం వీకెండ్ శనివారం నాటి ఎపిసోడ్ లో టెంపర్ వంశీ ఎలిమినేట్ అయ్యాడు. పెద్దగా అంచనాల్లేకుండానే 10వ సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా వచ్చిన వంశీ.. మరీ గొప్పగా కాకపోయినా ఉన్నంతలో తన ఆటతో పర్లేదనిపించాడు. 

పరిస్థితులు కలిసి రావడంతో ఒకటి రెండు సార్లు చివరివరకు వెళ్లి బయటపడ్డాడు. తర్వాత పర్లేదనిపించే ఆటతో 12 వారాలు నెట్టుకొచ్చేశాడు. ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా బయటకొచ్చేశాడు.

టెంపర్ వంశీ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. వారానికి రూ.2 లక్షల చొప్పున 12 వారాలకుగానూ రూ.24 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

టెంపర్ వంశీ, త్రిగుణ్ ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది. వీరిద్దరి స్నేహం చూసి కృష్ణార్జునులు అని అనుకున్నారంతా. హౌస్ లో బాగా వంట చేసేవాడిగా టెంపర్ వంశీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గేమ్స్ పరంగా ఎక్కువగా గెలవలేకపోవడం.. పెద్దగా గొడవలు పెట్టుకోకపోడవమే అతని ఎలిమినేషన్ కి కారణం. 

ఆయితే త్రిగుణ్ తో ఎప్పుడూ ఉండే వంశీ ఎలిమినేషన్ అవ్వడంతో అతని ఆటతీరు ముందుముందు ఎలా ఉంటుందో చూడాలి మరి. 

 

google-ad-img