Home

»

Tv News

బోల్డ్ లుక్‌లో షాక్ ఇచ్చిన తేజస్వి మడివాడ!

Sep 17, 2026 9:49AM

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ మరోసారి తన బోల్డ్ లుక్ తో నెట్టింట షాక్ ఇచ్చింది.  dance has entered my life again అనే క్యాప్షన్ తో బ్లాక్ డ్రెస్ లో నాలుగు ఫోటోలతో కూడిన ఓ పోస్ట్ ని షేర్ చేసింది. క్యాప్ణన్ తో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్ చేసింది. బోల్డ్ లుక్ లో ఉన్న ఈ ఫోటోషూట్ ప్రస్తుతం ఇన్ స్టాలో  వైరల్ అవుతోంది. 1.1 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్న తేజస్వి మడివాడ రెగ్యులర్ గా ఇలాంటి బోల్డ్ లుక్స్ తో కుర్రాళ్ళ మతిపోగెట్టేస్తుంటుంది.


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన తేజస్వి, రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీం సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మనం, శ్రీమంతుడు, పండగ చేస్కో, బాబు బాగా బిజీ లాంటి సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అగ్రెసివ్ బిహేవియర్ తో నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నా, తర్వాత ఓటీటీ బిగ్ బాస్ లో చాలా కూల్ గా కనిపించి మళ్లీ ఫ్యాన్స్ ని సంపాదించుకుంది.


గత కొన్ని నెలలుగా తేజస్వి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతోంది. కొన్నిసార్లు బ్లాక్ స్విమ్ సూట్ లో వైన్ గ్లాస్ తో పూల్ సైడ్ లో, మరోసారి యెల్లో టైర్డ్ గౌన్ లో, ఇంకోసారి గ్రీన్ చీరలో క్లీవేజ్ షో తో కనిపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజా రెట్రో లుక్ లో కూడా తన బోల్డ్ నెస్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఫిట్ నెస్, డ్యాన్స్ పై ఫోకస్ పెడుతూ జిమ్ లుక్స్ కూడా షేర్ చేస్తోంది.ప్రస్తుతం తేజస్వి సినిమాల స్పీడ్ తగ్గించి వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోల వైపు వెళ్లింది. Hide N Seek (2024), అర్థమైందా అరుణ్ కుమార్, The Mystery of Moksha Island, Reality Ranis of the Jungle, Kirrack Boys Khiladi Girls 2 లాంటి ప్రాజెక్ట్స్ చేస్తోంది. 34 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే అంటూ గ్లామర్ ఒలకబోస్తూ, ఇటు ట్రెడిషనల్ చీరకట్టులోనూ, అటు మోడర్న్ డ్రెస్ లోనూ అందాలను ఆరబోస్తూ టాలీవుడ్ బోల్డ్ క్వీన్ గా ట్రెండ్ అవుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com