(1).webp)
ఈటీవీలో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ పొందిన డ్యాన్స్ రియాలిటీ షో ఢీ (Dhee) సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఢీ 21 డబుల్ ఇంపాక్ట్ (Dhee 21 Double Impact) పేరుతో వస్తున్న ఈ కొత్త సీజన్‌కు సంబంధించిన ఇంట్రడక్షన్ ప్రోమో తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ షో సెప్టెంబరు 17 నుండి ప్రసారం కానుంది.
ఈ ప్రోమోలో షోకి సంబంధించిన మాస్టర్లు, కంటెస్టెంట్లు మరియు హైలైట్స్‌ను ఎంతో ఆకర్షణీయంగా పరిచయం చేశారు. స్టేజ్‌పై తమ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టే మాస్టర్ల ఎంట్రీ షోపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. ఈ సీజన్‌లో పోటీ పడబోయే తొమ్మిది మంది కంటెస్టెంట్లను (9 Contestants) ఈ ప్రోమోలో రివీల్ చేశారు మేకర్స్. దిలీప్ & ఆర్య, జాస్మిన్ తాజ్, గౌతమ్, ఈష, యశ్వంత్, భూమిక తివారి, నరేన్ రావుల, ఆర్నాల్డ్ మరియు అనుష్క వంటి ట్యాలెంటెడ్ డాన్సర్లు ఈ టైటిల్ కోసం పోటీ పడనున్నారు.
వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ కంటెస్టెంట్లు తమదైన ప్రత్యేక శైలిలో వేసిన డ్యాన్స్ స్టెప్స్ ప్రోమోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. క్లాసికల్ నుంచి హిప్-హాప్ మరియు వెస్ట్రన్ వరకు వివిధ నృత్య రూపాలతో వీరు స్టేజ్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. డబుల్ ఇంపాక్ట్ అనే కాన్సెప్ట్‌కు తగ్గట్టుగానే ఈసారి డ్యాన్స్ పర్ఫామెన్స్ లు మరింత మాసీగా, ఎనర్జిటిక్‌గా ఉండబోతున్నట్లు ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమ అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను కట్టిపడేయడానికి రెడీ అయ్యారు. ఒకే ఒక టైటిల్ కోసం ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్లు తలపడనున్న ఈ షో ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.




(3).webp)
.webp)
