
బుల్లితెర స్టార్ కపుల్ శిరీష, మహేంద్ర బొర్రా పెళ్లి తర్వాత వరుసగా ఎమోషనల్ పోస్టులతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. మొగలి రేకులు ఫేమ్ శిరీష రెండో పెళ్లిగా ఆర్జే, యాంకర్, ఇంటింటి రామాయణం సీరియల్ లో భరత్ పాత్రలో నటిస్తున్న మహేంద్ర బొర్రాను ఆగస్టు 28న వనపర్తి జిల్లా శ్రీరంగాపురం రంగనాయక ఆలయంలో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
తాజాగా పెళ్లి తర్వాత భర్త మహేంద్ర తన ఇన్ స్టాలో శిరీషపై స్పెషల్ పోస్ట్ పెట్టాడు. నువ్వొచ్చాకే నా జీవితం సంపూర్ణంగా మారింది. నా ప్రతి క్షణం నీతోనే బాగుంది. నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను. సిరి, నువ్వు నా లైఫ్ కి వచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటూ కొన్ని ఫోటోలతో క్యాప్షన్ రాశాడు. అంతకుముందు శిరీష కూడా.. ఎట్టకేలకు రహస్యం బయటపడింది, సిరి వెడ్స్ మహి అని పోస్ట్ చేసింది.
ఇద్దరి పరిచయం ఓ ఈవెంట్ లో మొదలై స్నేహంగా మారి ప్రేమగా మారిందంట. మహేంద్ర ఆర్జేగా, యాంకర్ గా, ఆ తర్వాత ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ లో నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్స్ తో శిరీష పాపులర్ అయింది. గతంలో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న శిరీషకు మహి రూపంలో మళ్లీ తోడు దొరికింది. పెళ్లి తర్వాత ఈ జంట సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంట్లో పట్టు చీరలో శిరీష, పంచెలో మహేంద్ర వ్రతం చేస్తూ కనిపించారు. ఫ్యాన్స్, సీరియల్ సెలబ్రిటీలు.. కంగ్రాట్స్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేంద్ర భరత్ పోస్ట్ తో మళ్లీ వీరి ప్రేమ కథ హాట్ టాపిక్ గా మారింది.




.webp)

