.webp)
ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పేరు బుల్లితెర మీద సోషల్ మీడియాలో తెలియని వారు ఎవరూ లేరు. బిగ్‌బాస్-3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళింది. అలాంటి తమన్నా సింహాద్రి ఇన్స్టాగ్రామ్ పేజీలో రీసెంట్ గా ఒక పిక్ ని పోస్ట్ చేసింది. అది వైరల్ గా మారింది. తమన్నా తన భర్తతో దిగిన ఫోటో అది. దానికి నెటిజన్స్ ఐతే చాలా కామెంట్స్ చేస్తున్నారు. "ఫైనల్లీ నా హజ్బెండ్ ఫోటోని రివీల్ చేసేసాను. నన్ను దీవించండి" అని పెట్టిన పోస్ట్ కి ఇనాయ సుల్తానా రెస్పాండ్ అయ్యింది. "కంగ్రాట్యులేషన్స్ ఆనందంగా ఉండు. నైస్ కపుల్, నైస్, సూపర్ జోడి, అక్కడ బావ సినిమా హీరోలా ఉన్నాడు. అందుకే ఇప్పటివరకు ఎవరికీ చూపించకుండా దాచేసారు కదా. గాడ్ బ్లేస్ యు అక్కా.. మా జంట దిష్టి తీయించుకోండి. సూపర్ అక్క" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ ఉన్న టైములో రవి కృష్ణ గురించి బూతులు బాగా మాట్లాడిన తమన్నా సింహాద్రిని తరువాత హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇక శ్రీముఖి తనను దత్తత తీసుకుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే ఎక్కువగా శ్రీముఖి ఇంట్లో కనిపిస్తూ వీడియోస్ చేస్తూ ఉంటుంది తమన్నా సింహాద్రి.
p>






