Home

»

Tv News

ఆస్కార్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

Apr 02, 2026

కుక్కలకు మనుషుల పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో  అంతే అనుబంధం ఉంటుందన్నది కాదనలేని నిజం. ఇప్పుడు అలాంటి ఒక అనుబంధం ఆటా షోలో కనిపించింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో తనుశ్రీ - ప్రాచి కలిసి పెర్ఫార్మ్ చేశారు. ప్రాచి చిన్న కుక్కపిల్ల గెటప్ వేసి తనుశ్రీతో కలిసి గురు మూవీలోని "ఓ సక్కనోడా పట్టుపిడికిలై" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. ఐతే ప్రాచి గెటప్ కి ఆ డాన్స్ కి జడ్జ్ నిహారిక స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. "ఎమోషన్ కూడా ఒక డాన్స్ " అంటూ రఘు మాష్టర్ చెప్పారు. ఇదంతా పక్కనపెడితే అందరూ పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే సుధీర్ మాత్రం ఏడుస్తూ కనిపించాడు.

అప్పుడు అందరూ అడిగేసరికి "నాకు మా ఆస్కార్ గుర్తొచ్చింది." అని చెప్పాడు. "ఇప్పుడు లేదా ఆస్కార్ " అంటూ కావ్య క్యూట్ గా అడిగింది. "వాడిని మేము చాలా మిస్ అవుతున్నాం... ఇప్పుడు లేడు" అని చెప్పాడు " టిక్ ఫీవర్ లో చాల వెరైటీస్ ఉంటాయంట.. అందులో ఒక రేరెస్ట్ ఫీవర్ వచ్చింది. డాక్టర్స్ రెండు రోజుల తర్వాత చనిపోయింది అని డిక్లేర్ చేసేసారు. ఇప్పటికీ హార్ట్ లో తెలీని పెయిన్" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సమీరా భరద్వాజ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com