Home

»

Tv News

నేహా చౌదరి మరుపురాని సంఘటనలు..శేఖర్ మాస్టర్ కొన్నారోచ్

Apr 02, 2026

నేహా చౌదరి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ పర్సన్. రీసెంట్ గా బిబి జోడిలో విశ్వతో కలిసి పెర్ఫార్మ్ చేసింది. ఫినాలేలో సెకండ్ పొజిషన్ లో నిలిచింది ఈ జోడి. అలాంటి నేహా ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉంది. డాన్స్ చేసి చేసి అలసిపోయింది. రీసెంట్ గా ఆమె రెండు ఇంటరెస్టింగ్ పోస్టులను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది. "ప్రతీ నిద్ర లేని రాత్రి అంటే కేవలం జీవితంలో ఎదురైన మర్చిపోలేని, తట్టుకోలేని బాధలు మాత్రమే కాదు అప్పుడప్పుడు అర్ధరాత్రి సమయంలో నేను అడక్కుండానే మోకాలు నాకు నొప్పిని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఐనా కానీ నేను మనస్ఫూర్తిగా ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాను" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని తన స్టేటస్ లో పెట్టింది నేహా చౌదరి.  

అలాగే ఇంకో పోస్ట్ ని చూస్తే  "కొన్ని మరుపురాని సంఘటనలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. ఇది కూడా అలాంటి ఫీలింగే. శేఖర్ మాష్టర్ నా బుక్ ఫస్ట్ కాపీ కొన్నారు. ఆ ఫీలింగ్ మర్చిపోలేనిది. మంచి మాటలకు చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఆ పుస్తకాన్ని రాయడాన్ని ఎంత ప్రేమించానో మీరు కూడా ఆ బుక్ ని చదవడంలో అంతే ప్రేమ చూపిస్తారని " అంటూ నేహా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్  స్టేటస్ లో పోస్ట్ చేసింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com