.webp)
సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్ కి క్రిటిక్స్, రివ్యూయర్స్ ని పిలిచారు. దానికి జాఫర్, సురేష్, ప్రభు, మూర్తి వంటి సీనియర్స్ అంతా వచ్చారు. ఇక రాగానే జాఫర్ ముందు సునీల్ తో మాట్లాడాడు. "ప్రతీ నేనే వస్తున్నా గాని ఇతని షోకి నా షోకి సుధీర్ రావట్లేదు" అన్నారు. "ప్రస్తుతానికి బానే ఉందిగా వచ్చి మళ్ళీ అనవసరంగా తవ్వించుకోవడం " అన్నాడు సుధీర్. "సుధీర్ రాగానే ఫస్ట్ ఏ క్వశ్చన్ అడుగుతారు" అంటూ విష్ణుప్రియ అడిగింది. "ఆ ఒక్క విషయం " అని జాఫర్ అనేసరికి "అది కాకుండా ఇంకేదైనా " అన్నాడు సుధీర్.
"నాకు అదే కావలి" అంటూ విష్ణు ప్రియా తెగ బెట్టు చేసింది. "లాస్ట్ టైం షోకి వచ్చి ఒక ఫోటో పెట్టా కింద కామెంట్స్ రేయ్ జాఫర్ ఏమడిగావురా మా అన్నని. ఏంటా సైకో ఫాన్స్" అన్నారు జాఫర్. "సర్ మళ్ళీ ఫాన్స్ ని సైకో అన్నారు మళ్ళీ మీకుంది" అంటూ విష్ణు ప్రియా చెప్పేసరికి సుధీర్ , జాఫర్ నవ్వేశారు.
"నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను మూర్తి గారు కలిసి సుధీర్ ని చేస్తాం " అని చెప్పారు జాఫర్. ఏదైనా మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని సుధీర్ అడిగేసరికి జాఫర్ చెప్పుకొచ్చారు. "సునీల్ గారిని నేను ఒక ప్రశ్న అడిగాను ఒక ఇంటర్వ్యూలో. నువ్వు హీరో మెటీరియలేనా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని అడిగా. ఆయన నా మీద చాలా సీరియస్ ఇపోయారు. నేను అతన్ని అవమానించడం కానీ కాదు. అది పెద్ద ఇష్యూ అయ్యింది. తర్వాత ఏడాది పాటు టాలీవుడ్ లో ఇంటర్వ్యూలు బంద్ చేసేసారు" అని చెప్పుకొచ్చారు.




.webp)
.webp)
