Home

»

Tv News

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రచ్చ రవి!

May 12, 2026

అటు సిల్వర్ స్క్రీన్ మీద... సమయం ఉన్నప్పుడు ఇటు బుల్లితెర మీద తన సత్తా నిరూపించుకుంటూనే ఉన్నాడు కమెడియన్ రచ్చ రవి. అలాంటి రచ్చ రవి రీసెంట్ గా ఇండియన్  బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో  స్థానం సంపాదించాడు. అలాగే "నీ ఋణం తీరేదెట్లా" అంటూ కూడా పుస్తకాన్ని పబ్లిష్ చేసి మదర్స్ డే సందర్భంగా తనికెళ్ళ భరణి చేతుల మీదగా ఆవిష్కరణ జరుపుకున్నారు. రచ్చ రవికి తన అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని ఈ పుస్తకంలో ఆవిష్కరించారు అంటూ వక్తలంతా చెప్పుకొచ్చారు.

ఇక రవి వరంగల్ లో తన ప్రస్థానాన్ని మొదలెట్టి దుబాయ్ రేడియోలో వ్యాఖ్యాతగా  పని చేసి వరంగల్ మునిసిపాలిటీలో ఉద్యోగం చేసి క్రియేటివిటీతో  అటు సినిమాల్లో ఇటు టీవిలో పని చేసాడు. "తీసుకోలేదా రెండు లక్షల కట్నం" అంటూ తన మార్క్ డైలాగ్ తో జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రచ్చ రవి బలగం, మ్యాడ్, స్కంద, రామం రాఘవం, బాపు వంటి ఎన్నో మూవీస్ లో నటించాడు. ఇక తన జీవితాన్ని నిలబెట్టింది చమ్మక్ చంద్ర అంటూ ఒక జబర్దస్త్ ఎపిసోడ్ లో కూడా చెప్పుకొచ్చాడు. అలాగే అదిరే అభి స్కిట్స్ లో కూడా నటించి బాగా ఎంటర్టైన్ చేసాడు. వన్స్ మోర్ ప్లీజ్ షోతో రచ్చ రవి మొదటి సారి బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ తేజ చేసిన "వెయ్యి అబద్దాలు" మూవీలో నటించాడు.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com