.webp)
సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ ప్రోమోలో కనిపించిన మూర్తి, ప్రభు ఇద్దరూ కలిసి వాళ్ళ ఎర్లీ స్టేజి జరిగిన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. "అది 1997 రామానాయుడు స్టూడియోలో శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్. నేను పరిటాల రవిని, మోహన్ బాబుని చూసి అన్నయ్య వస్తా అని చెయ్యూపా. అంతే ఒక్క సెకన్ లో పేలిన పేలుడికి తెగిపోయిన చెయ్యి ఒకటి వచ్చి నా స్కూటర్ మీద పడి ఆ రక్తం చింది నా మొహాన పడింది. అని చెప్పుకొచ్చారు జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు. "సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయాలని కోరిక . 5 గంటలకు రండి అన్నారు . ఏమనుకుంటున్నారు నా గురించి..
ఎం మాట్లాడుతున్నారు ఎంత కోపంతో రావాలో అంత కోపంతో అరిచారు. అప్పుడు అర్ధమయ్యింది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అని ఆయన్ని ఎందుకు అంటారో" అంటూ క్రిటిక్ మూర్తి చెప్పుకొచ్చారు. ఇక ప్రోమో స్టార్టింగ్ లో మూర్తి వచ్చి అటు సుధీర్ తో ఇటు విష్ణుప్రియతో కలిసి డాన్స్ చేశారు. విష్ణు ప్రియా ఐతే మూర్తిని ఒక ప్రశ్న అడిగింది "నా అందానికి ఎంత రేటింగ్ ఇస్తారు" అని "ఎందుకు ఎదో డిప్లమేటిక్ ఇష్టం లేదని " అన్నారు మూర్తి. "సుధీర్ అంటే ఆయన మీద వేసే జోకులన్నీ ఎక్కువగా నైట్ చుట్టూ తిరుగుతూ కాబట్టి జాఫర్ లోంచి జా, మూర్తిలోంచి మూ తీసుకుని "జామురాతిరి విత్ సుధీర్ " అని పెట్టి ఇంటర్వ్యూ చేద్దాం అన్నారు.




.webp)
.webp)
