
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఒక కొత్త జోడి ఎంట్రీ ఇచ్చింది. ఆ జోడి అందరికీ తెలిసిన జోడీనే. ఈ వారం ఈ షో 200 ఎపిసోడ్స్ సెలెబ్రేషన్స్ ని చేసుకుంది. ఇక ఇందులో శ్రీముఖి ఒక గుడ్ న్యూస్ ని ఆడియన్స్ కి చెప్పింది. హరి ఒక ఇంటి వాడు కాబోతున్నాడు అని అమ్మాయి కూడా ఇండస్ట్రీ అమ్మాయే అని. ఇంతలో బాహుబలి సాంగ్ ప్లే అవుతూ ఉండగా ఒక పల్లకిలో ఒక అమ్మాయి ఎర్రటి ముసుగు కప్పుకుని స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఆగలేక శ్రీముఖి ముసుగు తొలగించింది. అక్కడ కనిపించింది ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా. దాంతో అందరూ షాకయ్యారు. ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కో కామెంట్ చేశారు. ఐతే దీపికా మాత్రం ఏమీ మాట్లాడకుండా సిగ్గు పడుతూ మొగ్గలయ్యింది. "ఎప్పుడూ గలగలా మాట్లాడే దీపికా ఈరోజు ఎందుకు సైలెంట్ గా ఐపోయింది . ఈ సిట్యువేషన్ రియల్. మేమిద్దరం అంత ప్రేమలో ఉన్నాం కాబట్టి తాను మాట్లాడలేకపోయింది " అన్నాడు హరి. ఇక శ్రీముఖి ఐతే "దీపికకు స్టేజి కనిపిస్తే మాటలు ఆగవు అలాంటిది ఇంత సైలెంట్ ఉండడం మొదటి సారి చూస్తున్న. అంటే ఆమె ప్రేమలో పడినట్టే. హరి కంగ్రాట్యులేషన్స్ " అని చెప్పింది.
ఇక ఇద్దరూ కలిసి ఒక డ్యూయెట్ సాంగ్ కి డాన్స్ చేశారు. "సారీ అన్నా వదిన అని తెలియక దీన్ని చాలాసార్లు పిచ్చిదానా అన్నాను " అన్నాడు ఇమ్మానుయేల్. ఇక ఇద్దరూ శ్రీముఖి కాళ్ళ మీద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక అమ్మాయి తరపున పెద్దవాళ్ళు మానస్ అని చెప్పాడు చెప్పాడు. "ఇక నుంచి షూటింగ్ లో దీపికను చాల జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని చెప్పాడు. ఇక దీపికా ఐతే "హారి నా ప్రాణం , హరి నా ప్రపంచం " అని చెప్పింది. ఈ జోడి మానస్ కాళ్ళ మీద ఆశీర్వాదాలు తీసుకున్నారు. "దీపికా సారీ ఇప్పటి వరకు నేను నిన్ను ఎడ్డిదానివి, పిచ్చిదానివి అన్నాను ఇక నుంచి అనను " అని చెప్పింది. తర్వాత ఈ పరివారానికి పెద్ద సుహాసిని అని చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. "వరస్ట్ లో బెస్ట్ ఎంచుకున్నందుకు కంగ్రాట్స్ " అని శ్రీముఖి చెప్పింది. వెంటనే దీపికా "మీ అందరూ మా ప్రేమను చూసి ఎక్కిరిస్తున్నారు. మా లవ్ చూసి ఆ తాజ్ మహల్ కూడా సెల్యూట్ కొట్టింది. మా రిలేషన్ షిప్ చూసి మునిగిపోయిన టైటానిక్ షిప్ కూడా పైకొచ్చింది " అని చెప్పింది.




.webp)
