Home

»

Tv News

30 రోజుల్లో యాంకర్ అవ్వడం ఎలా ? తేజు పెద్ద హీరోయిన్ అవ్వాలి

Aug 24, 2026 3:19PM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఈ వారం కొంతమందికి స్పెషల్ గిఫ్ట్స్ ప్లాన్ చేసింది శ్రీముఖి. ముందుగా అమరదీప్ ని పిలిచింది. "మొదటి కోరిక కోరుకోవడానికి అమరదీప్ వస్తాడు. కోరిక అనే పదం వినగానే వాడే గుర్తొస్తాడు " అని చెప్పింది. "నాకున్న కోరికలకు అన్ని స్టిక్కులు విరిచేయొచ్చు " అని కౌంటర్ వేసాడు. ఇక శ్రీముఖి స్టిక్ ఇచ్చేసరికి దానికి మొక్కి "ఏం కాదు కదా మా బావ మానస్ దీనికి పూచీగా ఉంటాడు " అని చెప్పి మనసులో కోరికకు చెప్పాడు. "తేజు ఎప్పటికైనా హీరోయిన్ ఐపోవాలి. అది మంచి హీరోయిన్ . చెన్నైలో బాగా బిజీగా ఉంది. ఆ 15 రోజులు కాస్తా 30 రోజులు అవ్వాలి. ఆమె పెద్ద స్థాయికి వెళ్ళాలి. మొన్న కొన్న ఇల్లు కంటే పెద్ద ఇల్లు కొని హ్యాపీగా ఉండాలి. నేను ప్రతీ ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి తప్పకుండా రావాలి. నా కలల రాణి కూడా తప్పకుండా రావాలి అని కోరుకుంటూ " కర్ర విరగ్గొట్టాలనుకున్నాడు కానీ అది విరగలేదు.

ఇంతలో రోహిణి "తీరని కోరికలు కోరావురా భ్రష్టుడా .. " అంది. "మీ ఆవిడ నుంచి నువ్వు దూరం కావాలని  దేవుడు కూడా కోరుకోవడం లేదు. " అంది శ్రీముఖి. "ఒక్క నిమిషం నేను దూరమవుతానని చెప్పలేదు  30 రోజులు అక్కడ ప్రశాంతంగా పని చేస్తే ఇక్కడ నేను పని చేసుకుంటా  " అంటున్నా అన్నాడు అమరదీప్. "30 రోజులు అంటే అంతే నాయనా . మీ కోరిక నెరవేరదు కానీ చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఉంది " అని చెప్పింది.

"డాన్సర్, ఒక సీరియల్ హీరోగా , రీసెంట్ గా ఒక సినిమా హీరోగా మనందరికీ పరిచయమైన అమరదీప్ కి రీసెంట్ గా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలు పెట్టాడు కాబట్టి నీకు మేము ఇస్తున్నాము మైక్ " అంటూ ఒక మైక్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. "గోల్డెన్ మైక్ ఏదో  ఒక రోజు నువ్వు చాలా పెద్ద యాంకర్ వి కావాలని కోరుకుంటున్నాము " అంది. "అలా అవ్వాలంటే  30 రోజులు యాంకర్ అవ్వడం ఎలా అనే పుస్తకం ఇవ్వాలి " అన్నాడు హరి. "ఎం అవసరం లేదు. నేను ఎం చేసిన కానీ నిన్ను కాపీ కొట్టే చేస్తున్నాను . కొత్తగా ఏమీ చెయ్యట్లేదు " అన్నాడు. అంటే శ్రీముఖి యాంకరింగ్ ని కాపీ చేస్తున్నాను అనేసరికి ఆమె కూడా ఐ లవ్ యు కంగ్రాట్యులేషన్స్ అని చెప్పింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com