Home

»

Tv News

Karthika Deepam2: మాలిని ఇంట్లో సూరజ్, అసలు నిజం పసిగట్టిన కార్తీక్!

Aug 25, 2026 9:38AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  758 లో...పొద్దునే కార్తీక్ కి సూరజ్ కనిపించడు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. దాంతో డౌట్ వచ్చి బయటకు వస్తే మాలిని ఇంటి ముందు సూరజ్ బైక్ కనిపిస్తుంది. కార్తీక్ షాక్ అయి లోపలికి వెళ్లి చూస్తే మాలిని సూరజ్ కి చాలా ప్రేమగా టిఫిన్ వడ్డిస్తూ తల్లిలా చూసుకుంటుంది. అనాథని అని చెప్పుకున్న సూరజ్ కి మాలినితో ఇంత క్లోజ్ రిలేషన్ ఏంటని కార్తీక్ కి పెద్ద అనుమానం వస్తుంది.

 

అసలు ట్విస్ట్ ఏంటంటే మాలిని ఎవరో కాదు, దక్షిణామూర్తి కోడలు. అంటే సూరజ్ కి కన్నతల్లే మాలిని. ఇన్నాళ్లు ఇద్దరూ తల్లీకొడుకులని తెలియకుండా ఒక పెద్ద స్కెచ్ వేశారు. శివనారాయణ ఫ్యామిలీలోకి దూరి కంపెనీని, ఆస్తిని కొట్టేయాలన్నదే వాళ్ల ప్లాన్. ఈ విషయం తెలియక శివనారాయణ కూడా మాలినిని నమ్ముతూ ఉంటాడు. ఇటు జ్యోత్స్న ట్రాక్ లో కూడా పెద్ద మలుపు వచ్చింది. సూరజ్ మొదట పెళ్లికి నో చెప్పి ఇప్పుడు సడెన్ గా ఎంగేజ్మెంట్ వద్దు డైరెక్ట్ పెళ్లే చేసుకుందామని అంటాడు. దీంతో జ్యోత్స్న పూర్తిగా సూరజ్ ప్రేమలో పడిపోతుంది. నన్ను మనిషిగా మార్చావంటూ ఎమోషనల్ అవుతుంది. కానీ సూరజ్ మాత్రం లోపల వేరే ఆలోచనతో ఉంటాడు.

 

చివర్లో మాలినిని కార్తీక్ నిలదీస్తాడు. నువ్వెవరు.. సూరజ్ నీ కొడుకా అని అడుగుతాడు. మాలిని మాత్రం తెలివిగా తప్పించుకుంటుంది. కార్తీక్ కి మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది. వీళ్లిద్దరూ ఆడుతున్నది పెద్ద డ్రామా అని. ఈ నిజాన్ని దీపకు చెప్పి ఎలాగైనా బయటపెట్టాలని కార్తీక్ ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com