Home

»

Tv News

Illu illalu pillalu: నర్మద మాస్టర్ ప్లాన్.. అడ్డంగా బుక్కైపోయిన శ్రీవల్లి!

Mar 31, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-432 లో సాగర్ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ పర్స్ లో డబ్బులు లేక.. నర్మదని అడుగలేక సతమతమవుతుంటాడు. అప్పుడే నర్మద పర్స్ తీసుకొని చూస్తుంది‌‌. వెంటనే తన పర్స్ లోని డబ్బులు తీసి సాగర్ పర్స్ లో పెట్టి పొద్దున బట్టలు ఉతికేటప్పుడు నీ షర్ట్ పాకెట్ లో దొరికినయి అని నర్మద అంటుంది. ఆ తర్వాత ముద్దు కావాలని నర్మద అడుగగా లేదని నుదుటిపై ఒక ముద్దు ఇచ్చి వెళ్ళిపోతాడు. శ్రీవల్లిని చందు స్కూల్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. శ్రీవల్లి ఎప్పటిలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పరుగున వెళ్తుంది.

ఇక అదే సమయంలో నర్మద, ప్రేమ తమ ప్లాన్ ని వర్కవుట్ చేస్తారు. చందుకి కాల్ చేస్తుంది నర్మద. ఏంటి నర్మద అని అడుగగా వల్లి అక్క కల్లు తిరిగి పడకపోయిందని చెప్తుంది. దాంతో చందు ఫాస్ట్ గా స్కూల్ కి వెళ్తాడు. మరోవైపు శ్రీవల్లి తన అమ్మ వాళ్ళింట్లో అన్నీ తింటూ ఉంటుంది. ఆ నర్మద, ప్రేమల టార్చర్ కి ఏం తింటున్నావో .. ఏం తినట్లేదో..‌ సరిగ్గా తిను అమ్మడు అని శ్రీవల్లికి భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి అన్ని పిండివంటలు తినిపిస్తుంటారు. మరోవైపు చందు స్కూల్ కి వెళ్తాడు. అక్కడ ఒక టీచర్ అని వల్లి గురించి అడుగగా అలాంటి పేరుతో ఇక్కడ ఎవరూ లేరని అంటుంది. దాంతో చందు షాక్ అవుతాడు. అదే సమయంలో ప్రిన్సిపల్ అక్కడికి వస్తాడు. నా భార్య వల్లి ఇక్కడ చేస్తుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే వచ్చానని చందు అనగానే ప్రిన్సిపల్ అలాంటిదేం లేదని అంటాడు. ఒకే వల్లి అప్పట్లో వచ్చేది కానీ ఇప్పుడు రావడం లేదు.. మేమే మీకు ఫోన్ చేసి చెప్దామని అనుకున్నాం.. తమ సర్టిఫికెట్లు ఫేక్.. ఒకవేళ తను మా స్కూల్ వస్తానని చెప్పినా మేం తీసుకోమని చందుతో ప్రిన్సిపల్ అంటాడు. దాంతో చందు షాక్ అవుతాడు.

ఇక శ్రీవల్లి ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తాడు ప్రిన్సిపల్. అవి తీసుకొని నర్మదకి కాల్ చేస్తాడు చందు.  నాకు అన్నూ తెలుసు బావ.. మీకు తన గురించి తెలియాలనే కాల్ చేసానని నర్మద అనగానే శ్రీవల్లి గతంలో ఏం చేసిందోనని అన్నీ గుర్తుచేసుకుంటాడు. ఇక శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు చందు. అక్కడికి వెళ్ళి చూసేసరికి శ్రీవల్లి పిండిపదార్థాలు తింటూ ఉంటుంది. అది చూసి చందు షాక్ అవుతాడు. ఇక శ్రీవల్లికి కాల్ చేస్తాడు చందు. తను స్కూల్ లో ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. అదంతా చూసిన చందుకి ఫుల్ కోపం వస్తుంది. ఇక చందుని భాగ్యం, ఆనందరావు చూసి షాక్ అవుతారు. శ్రీవల్లి ఫోన్ లో అబద్ధాలు చెప్తుంటే చందుని చూపిస్తారు‌. దాంతో తను షాక్ అవుతుంది. ఇక వొంట్లో బాలేదని వల్లి చెప్పగా మరి ఆ సర్టిఫికేట్లు ఎందుకు పదా తీసుకొచ్చుకుందామని తనని బైక్ పై ఎక్కించుకొని స్కూల్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక.. మామయ్య బాధపడతాడు బావ.. నాకు ఆరోగ్యం బాలేకపోయిన జాబ్ చేస్తానని వల్లి అనగానే నాన్నకి నేను చెప్పుకుంటానని చందు అంటాడు. అయినా వల్లి రాకపోయేసరికి.. నీవి ఫేక్ సర్టిఫికేట్లు అని నాకు తెలుసు అని చందు అనగానే వల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com