Home

»

Tv News

Karthika Deepam2: నిజం తెలుసుకున్న జ్యోత్స్న.. దీపను మనవరాలుగా అంగీకరించిన పారిజాతం!

Mar 31, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-631లో.. కాంచన వాళ్ళింట్లో కార్తీక్, దీప, కాంచన ముగ్గురు మాట్లాడుకుంటారు. మామయ్య వీలునామాలో ఆ సెకెండ్ క్లాజ్ పెట్టకుంటే..ఆస్తి ఎప్పటికైనా నాదే అని ధీమాతో పారిజాతంతో కలిసి జ్యోత్స్న ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుందని కార్తీక్ అనగానే అవునురా అని కాంచన అంటుంది. ఇలాంటి సమయంలో జ్యోత్స్నకి పారిజాతం ఏం సలహా ఇస్తుందంటే.. ఒసేయ్ మనవరాలా‌.. ఓ పదిహేను నెలల్లో  నువ్వు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనకపోతే ఆ కార్తీక్ గాడు ఆస్తులన్నీ ఎగరేసుకుపోతాడని కార్తీక్ చెప్పగానే అవునురా అని కాంచన అంటుంది. నాకు ఏమనిపిస్తుందంటే పారిజాతం మనమరాలు ఆ జ్యోత్స్ననేమో అనిపిస్తుందిరా అని కాంచన అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. ఎందుకమ్మ అలా అనిపిస్తుందని కార్తీక్ అడుగగానే తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొస్తుంది కాంచన‌. మరోవైపు జ్యోత్స్న డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం పంపిన అతను వచ్చి.. జ్యోత్స్నకి ఇస్తాడు. ఇందులో ఉన్నవాటి ప్రకారం సుమిత్ర కూతురు జ్యోత్స్న కాదు.. దీప.. జ్యోత్స్న డీఎన్ఏ సాంపిల్స్ సుమిత్రతో మ్యాచ్ అవ్వలేదు.. దీపవి మాత్రమే మ్యాచ్ అయ్యాయని అతను చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతకి జ్యోత్స్న ఎవరు అని అతను అనగానే తనకి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది.

డబ్బులు ఇవ్వం పారిజాతం చూసి ఏంటే వాడికి డబ్బులు ఇచ్చావను అడుగుతుంది. దాంతో జ్యోత్స్న ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. అదే సమయంలో పారిజాతానికి దాస్ కాల్ చేస్తాడు. ఇక కాసేపటికి దాస్ ని పారిజాతం కలుస్తుంది. ఏంట్రా అని అడుగగా.. నీ మనవరాలు ఎవరో తెలిసింది. మన ముందే ఉంది.. పోల్చుకోలేకపోయామని దాస్ అనగానే ఎక్కడరా.. ఎవరురా.. అంటూ తెలుసుకోవాలని కుతూహలంతో అడుగుతుంది. ఇంకెవరో కాదమ్మా ఆ దీపే నీ మనవరాలు.. కుబేర్ తీసుకెళ్ళింది నీ మనవరాలు దీపే అని దాస్ చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పకు.. నీకు నాకు తప్ప ఎవరికి తెలియదని దాస్ అంటాడు. ఎందుకురా అని పారిజాతం అనగానే పిల్లల్ని మార్చిన ఆలోచన నీదే అని తెలిస్తే నిన్ను శివన్నారాయణ చంపేస్తాడని అనగానే అవునని పారిజాతం అనుకుంటుంది. ఇక దీప దగ్గరికి పారిజాతం పరుగున వెళ్తుంది.

కాంచన వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది పారిజాతం. ఒరేయ్ కార్తీక్ డోర్ తొయ్యరా అని గట్టిగా అరుస్తూ డోర్ కొడుతుంది. దీప.‌ నీకు ఒక సర్ ప్రైజ్ ఉంది..‌నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను పిలిచినప్పుడు బయటకు రా అని కార్తీక్ లోపలికి పంపించి డోర్ తీస్తాడు. పారిజాతం ఆగకుండా లోపలికి వచ్చి..‌దీప, దీప అని పిలిస్తే కాంచన, అనసూయ వస్తారు. ఏంటని వాళ్లు అడుగగా దీప ఎక్కడ అని దీప దీప అంటూ పిలుస్తుంది కాంచన. ఇక కార్తీక్ దీపని పిలవగానే తను వస్తుంది. తను రాగానే మనవరాలా అని గట్టిగా హగ్ చేసుకుంటుంది పారిజాతం. దాంతో.. మనవరాలా అని అనసూయ, కాంచన, కార్తీక్ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com