
కుక్కు విత్ జాతి రత్నాలు షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో చాలామంది ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. ఐతే ఇందులో ఒక ఇంటరెస్టింగ్ విషయం కనిపించింది. ప్రోమో ఫైనల్ లో గోమతి వచ్చింది. జడ్జెస్ ఈమె గోమతి అని చెప్పాడు ప్రదీప్. వెంటనే గోమతి "ఇప్పటి నుంచి ప్రదీప్ మాచిరాజు గారి శ్రీమతి " అనేసింది. వెంటనే అవినాష్, ఇమ్మానుయేల్ వచ్చి ఇద్దరికీ హారతులు అవీ ఇచ్చారు. గోమతి చేతిలో ఉన్న గిన్నె మూత తీసి పాల పాకెట్ ని చూపించేసరికి " అన్నా అప్పుడే పాల వరకు వచ్చేసావా " అంటూ హరి కామెంట్ చేసాడు. వెంటనే గోమతి ఇంకో బాక్స్ ఓపెన్ చేసి మైసూర్ పాక్ తినిపించింది. ఇక జడ్జ్ అలీ ఇదంతా చూసి "బాబోయ్ ఈ అమ్మాయి మొత్తం సెటప్ తో వచ్చిందిరోయ్.
లైట్స్ ఆఫ్ " అనేశాడు. ఇక గోమతి కూడా గులాబీ పూ రేఖల్ని ప్రదీప్ మీద జల్లింది ఆనందంతో. ఇక ప్రోమో స్టార్టింగ్ లో ఐతే ప్రదీప్ అన్నాడు "మీరు గెస్ట్ గా వస్తేనే క్యాన్ లు క్యాన్ లు కీర్ తెస్తారు మీ ఇంటికి ఒకసారి భోజనానికి వస్తాను " అన్నాడు అలీతో. సరే రా కానీ ఒక ఐటెం నువ్వు తెచ్చుకో అన్నాడు "కూరగాయలా " అన్నాడు ప్రదీప్. "గ్యాస్ బండ " అన్నాడు. "యు మీన్ గ్యాస్ సిలిండర్ " అని సైడ్ ఐపోయాడు ప్రదీప్. అసలే ప్రపంచమంతా గ్యాస్, చమురు కష్టాలు ఎలా ఉన్నాయో ఇందులో చూపించారు.





