Home

»

Tv News

Bigg Boss 10 Telugu Charan Re entry: చరణ్ రీఎంట్రీ.. వచ్చీ రాగానే కెప్టెన్సీ టాస్క్!

Sep 18, 2026 10:42AM

బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు Day 11 ఎపిసోడ్ లో షాకింగ్ సీన్ జరిగింది. గార్డెన్ ఏరియాలో మూడు కాఫిన్ బాక్సులను పెట్టి వాటిని ఓపెన్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. బ్లాక్ డ్రెస్ లో ఉన్న కొంతమంది ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఓపెన్ చేయండి అనగానే షాలినీ ఒక బాక్స్ ఓపెన్ చేసింది. వెంటనే వచ్చిన వాళ్లు షాలినీని పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అయ్యారు. ఏంటి ఇది.. ఎలిమినేషన్ ఇలా చేస్తారా? టచ్ చేసిన వాళ్లని తీసుకెళ్తారా అంటూ త్రిగుణ్, వర్షిణి, ముఖేష్ గౌడ, రామ్ ప్రసాద్ భయంతో అరిచారు.

 

కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇదంతా బిగ్ బాస్ ప్లాన్ చేసిన ప్రాంక్. షాలినీని బయట వరకు తీసుకెళ్లినట్లు చూపించి మిగతా బ్లాక్ డ్రెస్ వాళ్లు వెళ్లిపోయారు, లోపల షాలినీతో ఒకరు మిగిలారు. ఆ బ్లాక్ డ్రెస్ లో వచ్చింది ఎవరో కాదు, మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన చరణ్. ఐ యామ్ బ్యాక్ అంటూ చరణ్ మాస్క్ తీయగానే హౌస్ మేట్స్ అందరు షాక్ అయ్యారు. ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిన చరణ్ బయట జరిగినదంతా చూసి, త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన ఫైట్, ఝాన్సీ పై వస్తున్న ట్రోల్స్, షాలినీ పై వస్తున్న నెగిటివిటీ అంతా తెలుసుకుని రీఎంట్రీ ఇచ్చాడు.

 

చరణ్ రీఎంట్రీ తర్వాత నేరుగా కెప్టెన్సీ టాస్క్ లోకి వెళ్లాడు. బిగ్ బాస్ ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పగానే.. నేను త్రిగుణ్ తో ఆడతాను.. అతను ఎవరు చెప్పేదీ వినడు.. అలాంటి వాడు కెప్టెన్ గా వద్దు, అందుకే అతన్ని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలని చరణ్ చెప్పాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చరణ్ త్రిగుణ్ తో తలపడ్డా..‌చివరకు ఆ టాస్క్ లో త్రిగుణ్ విన్ అయ్యాడు. దీంతో.. చరణ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గలేదని మిగతా హౌస్ మేట్స్ అనుకున్నారు.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Charan Re-Entry, Charan, Shalini, Trigun, Captaincy Task, Bigg Boss Telugu Day 11, Bigg Boss Re-Entry, Bigg Boss Telugu Elimination]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com