
బిగ్ బాస్ తెలుగు సీజన్10 లో 11వ రోజు ఎపిసోడ్ మొత్తం ఫన్ తో నిండిపోయింది. గత కొన్నిరోజులుగా కెప్టెన్సీ కోసం కొట్టుకున్న హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ ఈరోజు రిలాక్స్ టాస్క్ ఇచ్చాడు. అదే ఇమిటేషన్ టాస్క్. ఒకరు ఒక హౌస్ మేట్ లా నటించి చూపించాలని చెప్పడంతో హౌస్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఈ టాస్క్ లో ముందుగా షాలినీ, త్రిగుణ్ జోడీ ఎంట్రీ ఇచ్చింది. షాలినీ ఏం మాట్లాడకుండా కేవలం హావభావాలతో యాక్ట్ చేస్తుంటే త్రిగుణ్ ఆమెకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ కామెడీకి అందరు నవ్వారు.
కానీ ఈరోజు అందరిని ఎక్కువగా నవ్వించింది మాత్రం నరేష్. వంశీ అన్న అంటే నాకు బాగా తెలుసు అంటూ వంశీలా ఛాతీ విరుచుకుని, బిల్డప్ వాక్ తో వచ్చాడు. నాకు తెలియక అడుగుతా.. నువ్వెవరు అనే వంశీ మార్క్ డైలాగ్ ని సేమ్ యాటిట్యూడ్ తో చెప్పడంతో హౌస్ షేక్ అయింది. వంశీ కూడా నవ్వుతూ.. అరే సేమ్ నాలాగే చేస్తున్నాడని అన్నాడు. ఆ తర్వాత సుధీర్ టర్న్ వచ్చింది.. సుధీర్ లా డల్ గా, ఏదో పోగొట్టుకున్నట్లు ముఖం పెట్టి నడుస్తూ వచ్చి అందరినీ నవ్వించాడు.. సుధీర్ కూడా తనను తాను చూసుకుని నవ్వుకున్నాడు.
దేబ్జానీ టర్న్ లో.. కోల్ కత్తాలో ఏం ఫేమస్ అంటే దేబ్జానీనే ఫేమస్ అని బెంగాలీ స్లాంగ్ లో చెప్పి పిచ్చ నవ్వులు పూయించాడు నరేశ్. రామ్ ప్రసాద్ కూడా తక్కువేం కాదు.. అమన్ వాకింగ్ స్టైల్ ని ఇమిటేట్ చేశాడు. కానీ హైలైట్ మాత్రం వర్షిణి ఇమిటేషన్. వర్షిణి వాక్ చేయమంటారా.. ఆమెకే ఇంకా సరిగ్గా వాక్ రాదు, మేమేం చేస్తామంటూ రామ్ ప్రసాద్ వేసిన పంచ్ కి హౌస్ మొత్తం నవ్వులు. వర్షిణి కూడా సిగ్గుపడుతూ నవ్వేసింది.
ఈ ఫన్ టాస్క్ తో పాటు కెప్టెన్సీ రేస్ కూడా టఫ్ గా సాగింది. ముఖేష్ గౌడ, ఝాన్సీ, షాలినీ, రామ్ ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ ఆల్రెడీ రేస్ లో ఉండగా, కొత్తగా రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ కూడా కెప్టెన్సీ కంటెండర్ గా చేరాడు. నిన్న జరిగిన ఫిజికల్ ఫైట్ పై నాగార్జున వీకెండ్ లో క్లాస్ తీసుకుంటాడా అని హౌస్ లో డిస్కషన్ నడిచింది. మొత్తంగా Day 11 ఎపిసోడ్ గొడవలు పక్కన పెట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగింది.





(9).webp)
