
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఫస్ట్ కెప్టెన్ గా రైతు బిడ్డ, ఫోక్ సింగర్ ఝాన్సీ ఎంపికైనట్లు లేటెస్ట్ లైవ్ అప్డేట్ వస్తోంది. అగ్నిపరీక్ష 2 ద్వారా డైరెక్ట్ ఎంట్రీ టికెట్ గెలుచుకుని హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఝాన్సీ, వచ్చీ రాగానే..అక్కడ టికెట్ గెలిచాను, ఇక్కడ కప్పు గెలుస్తానని శపథం చేసింది. సూర్యాపేట జిల్లా కోమటికుంట గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. బిగ్ బాస్ హౌస్ లో మొదటి కామనర్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా టఫ్ గా సాగింది. కెప్టెన్సీ కంటెండర్లుగా త్రిగుణ్, రోహిత్, షాలిని, అమన్, దేబ్జానీ, ముఖేష్ గౌడ, ఝాన్సీ, రామ్ ప్రసాద్ ఎంపికయ్యారు. టాస్క్ లో మొదట రోహిత్, రాం ప్రసాద్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మీరు నాకంటే స్ట్రాంగ్ కాంపిటేటర్ అనిపిస్తుంది అందుకే తీసేస్తున్నానని రామ్ ప్రసాద్ ని రోహిత్ రేస్ నుంచి తప్పించాడు. ఆ తర్వాత ఝాన్సీ వంతు వచ్చింది, భజన చేస్తే బంగారం అవుతారా అని నాపై వాడావు కదా.. నా గురించి తెలియకుండా భజన అనే వర్డ్ వాడటం నచ్చలేదని రోహిత్ ని టాస్క్ నుంచి ఔట్ చేసింది ఝాన్సీ.
రోహిత్ ని ఔట్ చేసిన తర్వాత ఝాన్సీ చేసిన భజన డ్యాన్స్ ప్రోమోలో వైరల్ గా మారింది. నా భజన నేను చేస్తా, నీ భజన నువ్వు చేసుకోమంటూ సేమ్ భజన చేసే వాళ్లు ఎగిరినట్లు ఎగురుతూ డాన్స్ చేసి అందరిని నవ్వించింది. చివరకు కంటెండర్లలో నుంచి ఝాన్సీ ఫైనల్ గా నిలిచి బిగ్ బాస్ సీజన్-10 మొదటి కెప్టెన్ గా ఎంపికైనట్లు బయట టాక్ నడుస్తోంది. మొదటి వారం మొత్తం సైలెంట్ గా, భజన అంటూ ట్రోల్ అయిన ఝాన్సీ ఒక్కసారిగా కెప్టెన్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అగ్నిపరీక్షలో 12 గేమ్స్ లో అందరినీ వెనక్కి నెట్టి టికెట్ గెలిచిన ఝాన్సీ.. ఇప్పుడు హౌస్ లో కూడా తన ఆటతో సత్తా చాటుతోంది. తొలి అడుగు పడింది.ఇప్పుడు బిగ్ బాస్ వేదికపైకి అడుగు పెడుతున్నా, మీ ప్రేమే నా బలమని ఎంట్రీ ముందు చెప్పిన ఝాన్సీ మాట నిలబెట్టుకుంటూ కెప్టెన్సీ దక్కించుకుంది. మరి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ హౌస్ ని ఎలా నడిపిస్తుంది. కెప్టెన్ గా తన రూల్స్ ఎలా పెడుతుందో చూడాలంటే ఈరోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Jhansi, Bigg Boss Telugu Captain, First Captain Jhansi, Folk Singer Jhansi, Agnipariksha 2, Captaincy Task, Rohith, Trigun]






