నేను కాలభైరవ.. ఇనయా మిత్రవింద : శ్రీహాన్
on Nov 30, 2022
బిగ్ బాస్ లో ఈ సీజన్ మొదటి వారం నుండి ఎక్కువగా మాటల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే.. ఠక్కున ఇనయా శ్రీహాన్ అనే చెప్తారు. ఎందుకంటే నామినేషన్స్ వచ్చాయంటే వీళ్ళ మీదనే ప్రోమోలను చేస్తారు అని అనడం లో ఆశ్చర్యమే లేదు.
ప్రేక్షకులు కూడా వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ వార్ చూడటం ఎంటర్టైన్ గా ఫీల్ అవుతారు. కానీ మధ్యలో కొన్ని రోజులు బాగున్నారు. మళ్ళీ ఈ మధ్య గతవారం హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. అయితే మొన్నటి ఫ్యామిలీ వీక్ లో వచ్చిన కొన్ని ఫ్యామిలీస్ కూడా ఇనయా, శ్రీహాన్ ల మధ్య గొడవ చూడడానికి బాగుంటుందని చెప్పారు.
హౌస్ లో మొన్న మొదలైన 'స్నో మ్యాన్' టాస్క్ లో ఒక్కో కంటెస్టెంట్ చేసిన 'స్నో మ్యాన్' ని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా శ్రీహాన్ దగ్గర ఎక్కువ పార్ట్స్ ఉండడంతో.. ఇనయా, శ్రీహాన్ దగ్గరవి తీసుకునే ప్రయత్నం చేయగా.. శ్రీహాన్ కాపాడుకునే ప్రయత్నంలో ఇనయాని పట్టుకున్నాడు. నిజానికి ఆ సందర్భంలో ఇనయాని తోసిపడేయొచ్చు శ్రీహాన్. కానీ అలా చెయ్యకుండా.. తీసుకోవద్దు తీసుకోవద్దు అంటూ ఆమెను పట్టుకున్నాడు. ఇది చూసిన శ్రీసత్య "ఏం చేస్తున్నారు మీరిద్దరు.. డిఫెన్స్ చేసుకున్నట్లు లేదు. ఏదో సాంగ్ కి డాన్స్ చేస్తున్నట్లుగా ఉంది" అని అంది. ఫైమా, రేవంత్ ఇద్దరు కలిసి శ్రీహాన్, ఇనయా ఎలా పట్టుకున్నారో చేసి చూపించారు.
అయితే ఆ తర్వాత శ్రీహాన్, ఇనయాని ముట్టుకోగా "అబ్బా షాక్ కొట్టింది" అంటూ నువ్వు "మగధీరలో మిత్రవిందవా" అని శ్రీహాన్ అన్నాడు. మరి ఐటమ్ సాంగ్ గర్ల్ ఎవరు అని అడుగగా, "శ్రీసత్య ఐటమ్ సాంగ్ గర్ల్" అని శ్రీహాన్ అన్నాడు. దీంతో శ్రీసత్య షాక్ అయ్యింది.