
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కెప్టెన్సీ టాస్క్ లో రామ్ ప్రసాద్, రోహిత్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా.. ఆడియన్స్ హౌస్ లో పద్నాలుగు మంది ఉంటే వారిలో నుండి ఎనిమిది మందిని మాత్రమే కెప్టెన్సీ రేసులో ఉంచారని బిగ్ బాస్ వారి ఫోటోలని చూపించాడు. ఇక అందులో భాగంగా .. బెలూన్స్ టాస్క్ ఇచ్చాడు. దానికి వర్షిణి సంఛాలక్ గా ఉంది. ఇక ఎవరు కెప్టెన్ గా అనర్జులని భావిస్తారో వారిపై ఉన్న బెలూన్ ని పగలగొట్టి రీజన్ చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. దాంతో షాలిని, రోహిత్ ఇద్దరు కలిసి గ్రూమ్ గేమ్ ఆడారు. దాంతో వారి గేమ్ రామ్ ప్రసాద్ కి అర్థమైంది. షాలిని, రోహిత్ సెలబ్రిటీలు అయినటువంటి త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ బెలూన్స్ ని పగులగొడతారు. దాంతో రామ్ ప్రసాద్.. నేను ఎమోషనల్ బాండింగ్స్ తోనే ఉంటాను, దేబ్జానీని నా సొంత చెల్లెలుగా చూసుకుంటా, నరేష్ ని ఫ్రెండ్ గా చూసుకుంటానని ఓపెన్ గా చెప్పాడు. హౌస్ లో రిలేషన్స్ కి వాల్యూ ఇస్తానని, అదే తన గేమ్ అని క్లారిటీ ఇచ్చాడు. ఈ పాయింట్ మీద నువ్వు ఎన్నిసార్లు అయినా నన్ను నామినేట్ చేయొచ్చు, నన్ను గేమ్ లో నుండి తీసేసినా పర్లేదు, కానీ నేను ఎమోషన్స్ ని వదలనని తెగేసి చెప్పాడు రామ్ ప్రసాద్.
దీనికి రోహిత్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. అన్నా.. మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ ఎమోషనల్ బాండింగ్స్ మధ్యలో మీరు అవతలి వ్యక్తులలోని టాలెంట్ ని గుర్తించలేకపోతున్నారు. మీరు చెల్లెలు, ఫ్రెండ్ అని ఒకరికి సపోర్ట్ చేస్తే, అవతల స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే అతడి అవకాశాన్ని మీరు తొక్కేసినట్టే అవుతుందంటూ రామ్ ప్రసాద్ బెలూన్ పగలగొట్టాడు రోహిత్. మొదట ఎమోషనల్ బాండింగ్ రీజన్ తో ఒక బెలూన్, ఆ తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, టాలెంట్ గుర్తించడం లేదన్న రీజన్ తో మరో బెలూన్ పగలగొట్టాడు రోహిత్. రోహిత్ ఇలా బెలూన్స్ పగలగొట్టగానే రామ్ ప్రసాద్ కూడా ఎమోషనల్ అయ్యాడు. వెంటనే దేబ్జానీ వైపు తిరిగి.. దేబ్జానీ నువ్వు నా చెల్లెలివి అయితే నెక్స్ట్ నువ్వు షాలినీ బెలూన్ పగలగొట్టమని రామ్ ప్రసాద్ చెప్పాడు. దీంతో గేమ్ కాస్త పర్సనల్ అయింది. షాలిని కూడా ఈ విషయంలో ఎంటర్ అయ్యి.. ఎమోషనల్ బాండింగ్ పేరుతో గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అని అంటుంది.
ఎమోషన్స్ ఇంపార్టెంట్ కానీ గేమ్ లో ఫెయిర్ గా ఉండాలని రోహిత్ అంటే నా ఎమోషన్ నా ఇష్టం, దాని కోసం నేను కెప్టెన్సీని కూడా వదులుకుంటానని రామ్ ప్రసాద్ అన్నాడు. ఈ గొడవతో కెప్టెన్సీ టాస్క్ మొత్తం రసవత్తరంగా మారింది. మరి రామ్ ప్రసాద్ వర్సెస్ రోహిత్ మధ్య సాగిన ఈ డిస్కషన్ లో ఎవరు కరెక్ట్ అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.






