
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో టెంపర్ వంశీ సైలెంట్ గా స్ట్రాంగ్ గేమ్ ఆడుతున్నాడు. హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచి తన కుకింగ్ స్కిల్స్ తో అందరి మనసు గెలుచుకుంటున్నాడు. రోజూ వంటగదిలోనే కనిపిస్తూ, టేస్టీ ఫుడ్ పెట్టి కంటెస్టెంట్స్ నుండి బెస్ట్ చెఫ్ అనే బిరుదు కూడా తెచ్చుకున్నాడు. ఫుడ్ విషయంలో ఎవరికీ కోపం తెప్పించకుండా అందరి కడుపు నింపుతున్నాడు.
అయితే గేమ్ విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్. ప్రతీ టాస్క్ లోనూ వంశీకి ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. దీనికి కారణం అతను ఫిజికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండటమే. ఒకవేళ వంశీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే, ఆ టీమ్ గెలవడం ఖాయమని మిగతా హౌస్ మేట్స్ కి తెలుసు. అందుకే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను మొదట్లోనే పక్కకు తప్పించాలని ప్లాన్ చేసి అతడిని తప్పిస్తూ ఒంటరిని చేస్తున్నారు. ఈ ఒంటరితనం గురించి నిన్నటి సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో వంశీ ఎమోషనల్ గా మాట్లాడాడు. నేను ఎవరి వైపూ లేను, నేను న్యూట్రల్ గా ఆడుతున్నా, ఒంటరిగా ఆడుతున్నా, నేను ఏ ఎమోషనల్ బాండింగ్స్ పెట్టుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. గ్రూప్ గేమ్ లు, ఫ్రెండ్షిప్ పేరుతో జరిగే డ్రామాలకు దూరంగా ఉండి తన గేమ్ తను ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. అతని మాటలకు బిగ్ బాస్ కూడా సైలెంట్ అయ్యాడు.
కానీ వంశీ ఫ్యాన్స్ మాత్రం అతని గేమ్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. వంశీ గేమ్ లోకి దిగితే అపోజిట్ లో ఎవరున్నా ఓడిపోవాల్సిందే, ఫిజికల్ టాస్క్ అయినా, మైండ్ గేమ్ అయినా వంశీ తోపు అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒంటరిగా ఆడుతున్నా, కుకింగ్ తో అందరినీ మెప్పిస్తూ, టాస్క్ లలో తన సత్తా చూపిస్తున్న టెంపర్ వంశీ ఈ సీజన్ డార్క్ హార్స్ అవుతాడని నెటిజన్లు అంటున్నారు.





