Home

»

Tv News

Illu Illalu pillalu : ప్రేమ, ధీరజ్ లని దూరం చేసిన భద్రావతి.. రామరాజు ఏం చేయనున్నాడు!

Sep 22, 2026 10:20AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu Illalu pillalu. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 585 లో...నాలుగు గోడల మధ్య జరిగిన పెళ్లి చెల్లదని అవతలి వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో వాళ్ల నోర్లు మూయించడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని రామరాజు చెప్తాడు. కానీ అవతల భద్రావతి మాత్రం ప్రేమను ధీరజ్ కి శాశ్వతంగా దూరం చేయడానికి ప్లాన్ వేస్తుంది. భయపెడితే, బాధపెడితే ప్రేమ వినదని గ్రహించిన భద్రావతి, ప్రేమ దగ్గరకు వెళ్లి తెగ ప్రేమ నటిస్తూ రామరాజు కుటుంబంపై విషం నింపుతుంది. వాళ్లు మన ఇంటికి వచ్చి చేయి చేసుకున్నారని, పరువు తీశారని.. తప్పు చేసి కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని.‌. ఇప్పుడు పగతోనే నిన్ను తీసుకెళ్లాలని చూస్తున్నారని నమ్మిస్తుంది.

 

భద్రావతి మాటలకు ప్రేమ కాస్త కదిలిపోతుంది. ధీరజ్ ఆవేశపరుడే అయినా రామరాజు మామయ్య మంచోడని ప్రేమ వాదిస్తుంది. అప్పుడే సేనాపతి కూడా ఎంట్రీ ఇచ్చి ధీరజ్ ఆ రోజు అందరి ముందు నీ కూతురు లేచిపోయిందని అవమానించాడని, తిరుపతిని వేరే వాళ్లతో పెళ్లి చేసి పరువు తీశాడని గుర్తు చేస్తాడు. నీకు మళ్లీ పరువు తీయడని మాటిచ్చావు కదా.. మరి ఇప్పుడు మళ్లీ అదే చేశాడు కదా.. ఇంకా వాడిని నమ్ముతావా అని భద్రావతి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో ప్రేమ చివరకు ధీరజ్ మళ్లీ తప్పు చేస్తే ఈ జన్మలో వాడి జీవితంలోకి వెళ్లనని మాటిచ్చానని.. ఆ మాట మీదే నిలబడతానని.. ఇక వాడి జీవితంలోకి వెళ్లనని తెగేసి చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. దీంతో భద్రావతి, సేనాపతి ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడతారు.

 

మరోవైపు రామరాజు ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతుంది. వల్లి చిరిగిపోయే చీరకు మెరుపు ఎక్కువ అంటూ టీలు పెడుతుంటే.. కామాక్షి రవ్వల నెక్లెస్ లెక్కలు వేసుకుంటుంది. వేదవతి మాత్రం పెళ్లి కూతురే లేకుండా పెళ్లి ఏంటని రామరాజుపై కోప్పడుతుంది. ఛాలెంజ్ చేసి ఇప్పుడు టెన్షన్ పడితే ఎలా అని నిలదీస్తుంది. దానికి రామరాజు రేపు పది గంటలకు ముహూర్తం పెట్టానని.. ఈలోపు ప్రేమను ఒప్పించి తీసుకురావాలని చెప్పి వెళ్లిపోతాడు. రాత్రి ధీరజ్, ప్రేమ కలుసుకున్నప్పుడు కూడా గొడవే జరుగుతుంది. నా మాటకు విలువ లేదా అని ధీరజ్ అడిగితే నువ్వు మా ఇంటికి వచ్చి నా మీద, మా నాన్న మీద చేయి చేసుకుని పరువు తీశావని ప్రేమ బాధపడుతుంది. గ్రాండ్ గా పెళ్లి చేసుకుందామని ధీరజ్ బతిమిలాడినా, నీ వల్ల నా కలలు, నా నమ్మకం చచ్చిపోయాయని, మా అత్తకు ఇచ్చిన మాటను తప్పలేనని ప్రేమ పెళ్లికి ఒప్పుకోదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Illu Illalu Pillalu, Illu Illalu Pillalu Episode 585, Star Maa Serial, Prema, Dheeraj, Bhadravathi, Senapathi, Ramaraju, Vedavathi, Valli]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com