
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 784 లో... కార్తీక్ తన పోలీస్ ఫ్రెండ్ సాయంతో శివన్నారాయణ కుటుంబాన్ని తన ఇంటికి తీసుకువచ్చాడు. మాలిని చేసిన కుట్ర వల్ల రోడ్డున పడ్డ తన కుటుంబాన్ని చూసి శివన్నారాయణ కోపంతో కార్తీక్ ను నిలదీస్తాడు. నిన్ను నమ్మినందుకే నా కుటుంబం శిక్ష అనుభవిస్తుందని అంటాడు. దీంతో కార్తీక్ ఎమోషనల్ అవుతూ మీరు మా తప్పు అంటున్నారు కదా.. మేమే సరిదిద్దుకుంటామని.. నా గొంతులో ప్రాణం ఉండగా ఈ ఇల్లు దాటనివ్వనని తెగేసి చెప్తాడు. బంధాలు తెంపుకోవడం మీకు తెలిస్తే పట్టుకోవడం నాకు తెలుసని, తప్పు చేశాడని అల్లుడ్ని, మాట వినలేదని మనవడ్ని, ఎదురు తిరిగిందని కూతుర్ని వదిలేసినట్లు తనను వదిలేయలేవని అంటాడు. చివరికి శివన్నారాయణ కూడా కార్తీక్ మాటకు కట్టుబడి, ఇది అద్దె ఇల్లే కదా, ప్రతి రూపాయికి లెక్క రాసుకోమని, అన్ని ఖర్చుల్లో భాగం పంచుకుంటామని షరతు పెట్టి ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాడు.
మరోవైపు మాలిని, సూరజ్ మధ్య గొడవ జరుగుతుంది. శివన్నారాయణ కుటుంబాన్ని రోడ్డున పడేలా ఎందుకు చేశావని సూరజ్ తల్లిని నిలదీస్తాడు. దానికి మాలిని మీ నాన్న చావుకు కారణమైన వాళ్లకు గుణపాఠం నేర్పుతున్నానని.. మీ తాతని అవమానించారు..నిన్ను కొట్టారని.. వాళ్ల పొగరు దించాలంటే స్థాయిని దించాలని చెప్తుంది. సూరజ్ సానుభూతి చూపించినా వినకుండా నువ్వు నా వైపే నిలబడాలని, నేను తప్పు చేసినా సరే తల్లికే సపోర్ట్ చేయాలని అంటుంరి. ఆ తర్వాత సూరజ్ జ్యోత్స్నను కలవడానికి పార్క్ కు వెళ్తాడు. మీ అమ్మ మేనకోడలు పెళ్లి ఆపేసింది.. ఆడపడుచుని రోడ్డుకు లాగిందని జ్యోత్స్న అనడంతో నా అమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దని సూరజ్ అంటాడు. అమ్మ లేకుంటే నాకు ఈ జన్మే లేదు, చెడ్డకొడుకు ఉంటాడు కానీ చెడ్డతల్లి ఉండదని చెప్పి అక్కడి నుంచి సూరజ్ వెళ్లిపోతాడు.
ఆ తర్వాత మాలిని ఇంటికి నేరుగా దీప, కార్తీక్ లు వచ్చి డైనింగ్ టేబుల్ పై కూర్చుని షాక్ ఇస్తారు. అక్కడ దక్షిణామూర్తి ఉండటం చూసి మాలిని టెన్షన్ పడుతుంది. మీ చుట్టాలా అని కార్తీక్ అడిగితే పని మనుషులు అని మాలిని కవర్ చేస్తుంది. దీంతో కార్తీక్ నువ్వు ఆడదానివేనా పిన్నీ, మేనకోడలు పెళ్లి ఆపేసి.. ఆడపడుచు జీవితాన్ని రోడ్డుకు లాగి ఇక్కడ గారెలు తింటున్నావా అని నిలదీస్తాడు. దీప కూడా మీకు ఏం హక్కు ఉంది ఆస్తులు లాక్కోవడానికి.. రెస్టారెంట్లు రాయించుకోవడానికి.. సుమిత్ర కుటుంబాన్ని నడిరోడ్డు మీదకు నెట్టేయడానికి అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఆ మాటలు విన్న దక్షిణామూర్తి నా కూతురు కుటుంబానికి ఏమైందని కంగారు పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam 2, Karthika Deepam 2 Episode 784, Star Maa Serial, Karthik, Deepa, Shivannarayana, Malini, Suraj, Jyotsna, Dakshinamurthy]






