.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 215 లో.... నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లనని మాధవ్ అనడంతో కన్నా, కేశవ్, చక్రి కూల్ అవుతారు. పెద్ది కేశవ్ దగ్గర నుంచి లాక్ తీసుకుని డోర్ తీస్తానని చెప్పడంతో అన్నయ్య ఎక్కడికి వెళ్లడని అందరు ఊపిరి పీల్చుకుంటారు. అయితే చక్రికి మాత్రం మాధవ్ మీద అనుమానం వచ్చి నేరుగా భన్సీ ఇంటికి వెళ్తాడు. అక్కడ మనీషా చక్రిని చూసి సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతుండటంతో చక్రికి డౌట్ మరింత పెరుగుతుంది. ఏం జరిగిందని భన్సీని అడగ్గా నిన్న మాధవ్ భయ్యాని మా మనీషాని పెళ్లి చేసుకుంటారా అని అడిగానని భన్సీ చెప్పడంతో చక్రి ఆనందంతో గాల్లో తేలిపోతాడు.
చక్రి ఇంటికి వచ్చి గాల్లో తేలిపోతూ పాటలు పాడుతూ మన ఇంటికి సంబరాలు రాబోతున్నాయని, పెళ్లి పందిరి కనిపిస్తుందని చెప్పడంతో కేశవ్, నారాయణ, మహా ఏం జరిగిందని ఆత్రంగా అడుగుతారు. చివరికి చక్రి అసలు విషయం బయటపెడతాడు. భన్సీ మనీషా గురించి అన్నయ్యని అడిగాడని ఇద్దరు సిగ్గుపడుతున్నారని చెప్పడంతో ఇంట్లో అందరు సంబరపడతారు. ఇది నాకు ఎప్పుడో తెలుసు.. అందుకే రుద్రాంబిక గుడిలోనే అడిగానని నారాయణ అంటాడు. వాడి జీవితంలో కూడా మంచి జరగబోతోందని అందరు ఖుషీ అవుతారు. ఇంతలో మాధవ్ రాగానే అందరూ కలిసి క్యా జీ, ఖానా ఖావోజీ అంటూ హిందీ పాటలతో ఆటపట్టిస్తారు. మనీషా సైట్ వద్దకు వచ్చేది.. ఒకరు వండిన వంటలు ఇంకొకరు తినేవారని గుర్తుచేస్తూ దొంగ అంటూ ఆటపట్టిస్తారు. సిగ్గుతో ఏం చెప్పాలో తెలియక పెద్ది బయటకు వెళ్లిపోతాడు.
మరోవైపు షాపులో కేశవ్, శైలు మధ్య గొడవ జరుగుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని శైలు అడగ్గా లిఫ్ట్ చేస్తే మూడు గొడవలే అవుతాయని కేశవ్ అంటాడు. నువ్వు పెట్టిన కండీషన్ చెప్పానంతే, మీ అన్నయ్యకు బుద్ధి లేదా, చిన్న పిల్లాడా అని శైలు నోరు పారేసుకోవడంతో కేశవ్ కి కోపం వస్తుంది. మా అన్నయ్యని అనేంత ధైర్యం నీకు ఉందా అని ఫైర్ అవుతాడు. నీకు వాళ్లే ముఖ్యం.. నేను కాదంటూ శైలు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Podharillu, Podharillu Episode 215, Star Maa Serial, Madhav, Manisha, Keshav, Chakri, Bhansi, Narayana, Peddi, Shailu]






