Home

»

Tv News

Podharillu : శైలు, కేశవ మధ్య గొడవ.. జయంతిని నిలదీసిన మహా, చక్రి!

Sep 8, 2026 9:37AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  పొదరిల్లు  Podharillu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  203 లో.... ఈ రోజు నేను స్కూటీపై వెళ్తానని మహా అనడంతో చక్రి షాకవుతాడు. లైసెన్స్ లేదు కదా ఎలా వెళ్తారు.. అలా వెళ్లొచ్చని చెప్పిన వెదవ ఎవరు అని చక్రి అంటే.. మీరే ఆ వెదవ, ఎల్ఎల్ఆర్ ఉంటే వెళ్లొచ్చని మీరే కదా చెప్పిందంటూ మహా కౌంటర్ వేస్తుంది. స్కూటీ దుమ్ము పట్టి జిడ్డులా ఉందని అంటూ చాలాసార్లు ట్రై చేసి స్టార్ట్ చేస్తుంది. మహా వెంటే చక్రి బైక్‌తో ఫాలో అవుతాడు. మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో నీ వల్లే ఆగిందని మహా తిడితే నేను రావడం వల్లే సాయం చేయగలుగుతున్నానని చక్రి అంటాడు.

 

స్కూటీని కేశవ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ శైలు ఉండి.. మీ అన్నయ్యకి పెళ్లి సెట్ అయిందట కదా అంటూ గంతులు వేస్తుంది. ఆ అమ్మాయి మాకెవ్వరికి నచ్చలేదు.. అన్నయ్య సంతోషంగా ఉండలేడని కేశవ అనగా ఆయనకు నచ్చింది కదా మధ్యలో మీరెందుకు అడ్డు అని శైలు అంటుంది. ఇంతలో చక్రి, మహా రాగానే శైలు.. హాయ్ డ్యూడ్ అంటుంది. పెద్దిలాంటి మంచి వ్యక్తికి అలాంటి అమ్మాయి సెట్ కాదు, పెళ్లిని ఆపాలని మహా అనడంతో శైలుకి ఉడికిపోతుంది. కేశవ స్కూటీ రిపేర్ చేయగా థాంక్స్ చెప్పి వెళ్లిపోతారు.

 

ఆ తర్వాత కేశవ-శైలు మధ్య గొడవ జరుగుతుంది. అన్నీ కావాలంటే దొరకవు, అడ్జస్ట్ అవ్వాలని శైలు అనగా.. అన్నయ్య జీవితం ముఖ్యం, మన పెళ్లి అవ్వకపోయినా పర్లేదని కేశవ అంటాడు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నావంటూ శైలు కోపంగా వెళ్లిపోతుంది. మరోవైపు చక్రి మాధవ దగ్గరకు వెళ్లి.. నీ పెళ్లిలో మా ఇష్టం లేదా, ఇల్లరికం రమ్మంటే ఎందుకు వెళ్లలేదని నిలదీస్తాడు. అప్పుడు మీరే ముఖ్యం అనిపించింది, ఇప్పుడు నా జీవితమే ముఖ్యం అంటూ పెద్ది కవర్ చేస్తాడు. చక్రి బ్రోకర్ నుంచి జయంతి నంబర్ తీసుకుని లవ్ సింబల్ తో సేవ్ చేస్తాడు. చివర్లో చక్రి, మహా జయంతిని కాఫీ షాప్ కి పిలిచి.. మా అన్నయ్య మీకు నిజంగానే నచ్చాడా అని చక్రి అడగగా..‌మీ ఇంట్లో వాళ్లకి నచ్చలేదు కదా కారణం ఏంటని జయంతి రివర్స్ ప్రశ్నలు అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com