Home

»

Tv News

Illu Illalu pillalu :ముగ్ధతో రెచ్చిపోయిన ధీరజ్, ప్రేమ రచ్చ... వేదవతి ఎమోషనల్!

Sep 8, 2026 9:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఇల్లు ఇల్లాలు పిల్లలు  Illu illalu pillalu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  573 లో....రామరాజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుగుతుండగా ధీరజ్ వెనకే ముగ్ధ కూర్చోవడం చూసి బయట ఉన్న ప్రేమ రగిలిపోతుంది. పూజలో ధీరజ్ పక్కన ప్రేమ లేకపోవడంతో.. నీ భార్య పక్కన లేనందుకు బాధగా ఉందని రామరాజు మనసులో అనుకుంటూ వేదవతి వైపు కోపంగా చూస్తాడు. వ్రతం అయ్యాక వాయినాలు ఇచ్చే సమయంలో ముగ్ధ.. బాయ్ ధీరజ్ అనడంతో ప్రేమ మరింత కంగారుపడుతుంది. చందు, వల్లి మధ్య కూడా చిన్న గొడవ జరుగుతుంది.

 

పంతులు భర్తల ఆశీర్వాదం తీసుకోమనగా రామరాజు చందుతో వల్లిని ఆశీర్వదింపజేస్తాడు. కానీ తన భార్య వేదవతిని మాత్రం.. ధీరజ్, ప్రేమల పెళ్లి చేసి తప్పు చేశావు.. వాళ్లు కలిసి సంతోషంగా ఉన్న రోజే నీతో మాట్లాడతానంటూ వేదవతిని అవమానించి వెళ్లిపోతాడు రామరాజు. దీంతో బాధపడుతున్న వేదవతి దగ్గరికి నర్మద వస్తుంది. మామయ్య మాటల్లోనే పరిష్కారం ఉంది. ప్రేమ, ధీరజ్ లను కలిపే ప్రయత్నం ఆశీర్వాదం నుంచే మొదలుపెడదామని ఐడియా ఇస్తుంది.

 

ఇదే టైంలో బయట ప్రేమ ముగ్ధను.. బండి మీద తిరగడం సరిపోలేదా.. ఇంటికి కూడా వచ్చావా అంటూ నిలదీయగా వేదవతి, నర్మద వచ్చి సర్దిచెప్తారు. వేదవతి బలవంతంతో ధీరజ్ ప్రేమను ఆశీర్వదిస్తూనే..‌ఇలాగైనా నా కాళ్లు పడతావని ఒప్పుకున్నానని అనడంతో ఇద్దరూ.. నీ మొహం చూస్తే వాంతి వస్తోందంటూ గొడవపడి వెళ్లిపోతారు. చివర్లో భద్రవతి వల్లిని పిలిచి కొట్టి..‌ నా తమ్ముడు తిరుపతి సుకన్యనే చేసుకుంటానని చెబుతున్నాడు, వాడిని రెచ్చగొట్టింది నువ్వే కదా అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com