
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2 . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 772 లో....సూరజ్ దగ్గరికి కార్తీక్ వెళ్లి జ్యోత్స్న ఎంతలా ప్రేమించిందో చెప్తాడు. వాళ్లిద్దరి డిస్కషన్ లో సూరజ్ తన పగ కోసమే అలా చేసినా జ్యోత్స్నని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ప్రేమను బయటపెట్టి జ్యోత్స్న-సూరజ్ లను ఒకటి చేయాలని కార్తీక్ అనుకుంటాడు. సుమిత్రకి మాలిని ఫోన్ చేసి.. ఏం సుమిత్ర ఆరోగ్యం ఎలా ఉంది.. చెల్లెలు చేసిన అన్యాయానికి మీ అన్నయ్య పోయాడు కానీ నీ కూతురికి జరిగిన అన్యాయానికి నువ్వు బతికేశావంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నీ కూతుర్ని నా కొడుకు దగ్గరకు ఎందుకు పంపావ్.. నా కొడుకుని నీ వైపు లాగాలని చూస్తున్నారా అంటూ వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత జ్యోత్స్న , సూరజ్ దగ్గరకు వెళ్లిందని సుమిత్ర అందర్నీ పిలిచి పంచాయితీ పెడుతుంది. గతం నాకు అనవసరం, ఆ గతాన్ని మర్చిపోయింది సూరజ్ వల్లనే.. మెడలో కట్టాల్సిన తాళిని ఒడిలో పడేసి వెళ్లిపోయాడు.. నాకు జీవితంపై ఆశలు కల్పించి వదిలేస్తే అడిగే అధికారం లేదా అని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కార్తీక్, దీప ఎంట్రీ ఇచ్చి.. గాయపడిన వాళ్లకే న్యాయం అడిగే హక్కు ఉంటుందని కార్తీక్ అంటాడు. మీరు మాలిని ఇంటికి వెళ్లి ఊడిగం చేస్తామని ఆఫర్ ఇచ్చారా.. మా కోసం వాళ్ల కాళ్లపై పడతారా అంటూ శివన్నారాయణ, దశరథ, సుమిత్ర నిలదీస్తారు.
నేను ఆ ఇంటికి వెళ్లింది శివన్నారాయణ మనవడిగా కాదు మనిషిగా, వాడు వరదలా వచ్చి జ్యోత్స్న కట్టుకున్న ఇంటిని కూల్చేసి వెళ్లిపోయాడంటూ కార్తీక్ .. 'అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలో రవితేజ రేంజ్ లో డైలాగ్ కొడతాడు. నా మరదలి జీవితంతో ఆడుకుంటే ఊరుకోను.. మంచివాడని అనుకున్నా ముంచేవాడని తెలిస్తే ఇంతవరకు రానిచ్చేవాడిని కాదని వాదిస్తాడు. చివర్లో జ్యోత్స్న.. నేను వాడి వెనుక పడను.. వాడే కావాలని అడగను.. నాకు నేను దొరికే వరకు నన్ను నేను వెతుక్కోనివ్వండి అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది. ఏదో ఒక రోజు మబ్బులన్నీ పోతాయి ఆకాశం అసలు రంగు కనిపిస్తుంది.. అప్పటివరకు మబ్బులు పట్టిన ఆకాశంలాగే ఉంటానని చెప్పి దీపను తీసుకుని కార్తీక్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






