Podharillu Serial: మహా చుట్టూ విక్కీ.. చక్రికి కోపం!
Nov 27, 2026 10:16AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ ఎపిసోడ్271లో..లక్కీ వల్ల ప్రాజెక్ట్ సెట్ అవ్వడంతో విక్కీ సక్సెస్ పార్టీ అనౌన్స్ చేస్తాడు. మహా రాను అన్నా, నీ కోసమే పార్టీ, నువ్వు రాకపోతే క్యాన్సిల్ అని విక్కీ అంటాడు. స్టాఫ్ బలవంతంతో మహా ఒప్పుకుంటుంది. ఫ్రంట్ సీట్ మహాకే రిజర్వ్ అని విక్కీ అనడంతో దివ్య ఆట పట్టిస్తుంది, మహా మాత్రం కోపంగా చూస్తుంది.
రెస్టారెంట్‌లో మహా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఫ్రైడ్ రైస్ చాలు అన్నా, విక్కీ స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేస్తాడు. నువ్వు కాబట్టే ఇంత స్పెషల్ అని దివ్య అంటుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలని మహా చక్రికి వాయిస్ మెసెజ్ పంపి లొకేషన్ పెడతానని అడుగుతుంది. చక్రి సరే అంటాడు. నీ ప్లేట్‌లోంచే షేర్ చేసుకుంటానని విక్కీ అనడంతో మహాకు నచ్చదు అంటుంది. హెడ్ ఏక్‌గా ఉందని మహా బయల్దేరుతుంటే, చక్రి వచ్చాడని చెప్తుంది. కారు వరకు డ్రాప్ చేస్తానని విక్కీ వెంట వస్తాడు. చక్రి తెరిచిన డోర్‌లోనే మహా కూర్చుంటుంది. షీ ఈజ్ మై గర్ల్, జాగ్రత్తగా డ్రాప్ చేయ్ అని విక్కీ ఓవర్ చేయడంతో చక్రికి ఒళ్లు మండిపోతుంది.
కారులో విక్కీ గురించి చక్రి నిలదీస్తాడు. ఉదయం బాస్‌గా తిట్టాడు, అంతే అని మహా సర్ది చెప్తుంది. దారిలో చక్రి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో వాచ్ చూసి మహా బాగుందంటుంది. ఇంటికి వచ్చాక చక్రి తన కోపాన్ని క్యాబ్ డ్రైవర్ అంటూ వెళ్లగక్కుతాడు.కన్నా.. వదిన అన్నయ్యకు ఐ లవ్యూ చెప్పింది అని అనడంతో చక్రి ఇరుక్కుపోతాడు. అసలు నిజం చెప్తూ మహా.. ల్యాప్‌టాప్ మిస్ అయిన టైంలో చక్రి హెల్ప్ చేశాడని, ఆ సంతోషంలోనే హగ్ చేశానని, దివ్య, కన్నా ఉన్నా అలానే చేసేదాన్నని క్లారిటీ ఇస్తుంది. అబద్ధం చెప్పానని, నా ఊహల్లో కూడా స్వేచ్ఛ లేదా అని చక్రి సీరియస్ అయి ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.




