Illu Illalu Pillalu: కడుపుతో ఉన్న వల్లిని చూడడానికి వెళ్లిన రామరాజు ఫ్యామిలీ..అవమానించిన భాగ్యం!
Nov 27, 2026 10:11AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu Illalu Pillalu . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 641 లో.....అంజలి భుజం మీద చందు చేయి వేసి ఫోటో తీసుకోవడం ధీరజ్ చూసి షాక్ అవుతాడు. రేయ్ పెద్దోడా ఎంత పని చేశావ్ రా అని గుండె పట్టుకుంటాడు. ఆ గ్యాప్ లో అంజలిని తీసుకొని చందు పారిపోతాడు. ప్రేమ వచ్చి.. ఎవరమ్మాయి వెనక పడుతున్నావని ధీరజ్ కాలర్ పట్టుకుని నిలదీయడంతో.. మీ భద్రావతి అత్తయ్యలా కనిపిస్తే ఫాలో చేశానని ధీరజ్ కవర్ చేస్తాడు. చందు అన్నయ్య, అంజలి కలిసి ఉండటం ఏంటని ధీరజ్ మనసులో అనుకుంటాడు.
మరోవైపు వల్లీకి పుట్టబోయే బిడ్డ కోసం స్వెటర్ కుట్టుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఆనందరావు పాలు తీసుకొచ్చి ఇస్తాడు. అదే సమయంలో రామరాజు, వేదవతి, సుకన్య వల్లీని చూడటానికి వస్తారు. వేదవతి ఫ్రూట్స్ ఇచ్చి.. చక్కగా తినమ్మా" అని చెప్తుంది..రామరాజు హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బు ఇస్తాడు. వాళ్లని చూసి వల్లీ చాలా సంతోషపడుతుంది. ఇంతలో భాగ్యం వచ్చి ఆ ఫ్రూట్స్, డబ్బుని విసిరేస్తుంది. ఊరిలో అందరూ కడుపుతో ఉన్న కోడలిని చూడలేదు అంటారని గొప్పలు చెప్పుకోవడానికి నాలుగు కాయలు, నాలుగు డబ్బులు ముష్టి వేయడానికి వచ్చారా అని తిడుతుంది.
దాంతో వేదవతి.. పెళ్లి అయిన వరకే నీ కూతురు, తర్వాత నా కోడలు, మేం మా కోడల్ని చూసుకోవడానికి వచ్చామని అంటుంది. మామయ్య వాళ్లని అనొద్దు, ప్రేమతో వచ్చారని వల్లి అంటే పిచ్చిదానా, నీ మొగుడు కడుపుతో ఉన్నావని తెలిసి కూడా పంపేశాడు, వీళ్లు నిన్ను తీసుకెళ్లరు, నువ్వు వెళ్తే చందు వెళ్లిపోతాడు, వీళ్లకి కొడుకే ఎక్కువ అని భాగ్యం రెచ్చగొడుతుంది. వాళ్లు నన్ను ఇంటికి తీసుకెళ్లకపోయినా పర్లేదు, వాళ్లని ఏం అనొద్దని వల్లి అంటుంది. కిందపడిన ఫ్రూట్స్, డబ్బుని సుకన్య ఏరుతుంది.
అమ్మ నువ్వు మమ్మల్ని నమ్ముతున్నావ్ కదా, నువ్వు మా పెద్ద కోడలివి, తెలిసో తెలీకో తప్పు చేశావ్, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నావ్, నీకు అండగా నేను, మీ అత్తయ్య, నర్మద, ప్రేమ, ధీరజ్ అందరం ఉంటామని వల్లీతో రామరాజు అంటాడు. ఇప్పటికి ఇప్పుడు తీసుకెళ్లలేకపోవచ్చు కానీ త్వరలోనే మన ఇంటికి తీసుకెళ్తాం, కడుపులో బిడ్డ జాగ్రత్త అని చెప్పి వేదవతి వాళ్ళు వెళ్లిపోతారు. తర్వాత భాగ్యం.. ఆ చందు గాడు ఇంకోదాన్ని తెచ్చి నా పెళ్లాం అంటాడని వల్లీని భయపెడుతుంది. చందుకి ధీరజ్ ఫోన్ చేసి.. గుడికి అంజలితో వచ్చావ్ కదా అంటే నేను రాలేదు, అంజలి ఇక్కడ లేదని అబద్ధం చెప్తాడు. అంజలి కాఫీ ఇస్తూ నవ్వుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



.webp)
