Home

»

Tv News

Podarillu: మనీషాకు గోరుముద్దలు తినిపించిన మాధవ.. చక్రి, మహా దగ్గరవుతారా!

Sep 23, 2026 10:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -216 లో... కన్నా, మహాలక్ష్మీ కలిసి బస్టాప్ కి నడిచి వెళ్తుంటారు. వెనకాల నుంచి చక్రి పరిగెత్తుకుంటూ వచ్చి మహాని.. మీరెవరో అని పిలుస్తుంటాడు. ఎందుకు అలా పరిగెడుతున్నారు, వెనకాల ఎవరైనా తరుముతున్నారా అని మహా అనగా లేదు, ముందు ఉన్నవాళ్లు రమ్మన్నారని గోపిక గురించి చెప్తాడు. జెలసీ ఫీల్ అవ్వడం లేదా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు చక్రి. బస్టాప్ రాగానే.. మీరు అన్నయ్య, మనీషాల పెళ్లి గురించి ఆలోచించండి, నేను నా గోపికతో దగ్గరవడం గురించి ఆలోచిస్తానని గోపిక దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు చక్రి.

 

ఇక సైట్ లో భన్సీ, మాధవ ఎదురుపడతారు. మాధవ భయ్యా.. రా తిందామని భన్సీ పిలుస్తాడు. మనీషా ఎండలో క్యారేజ్ తీసుకురావడంతో.. ఇంత ఎండలో ఎందుకు తీసుకురమ్మన్నావని మాధవ తిడతాడు. మనీషా తెలుగులో మాట్లాడటం చూసి మాధవ షాక్ అవుతాడు. కన్నానే తెలుగు నేర్పిస్తున్నాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే కదా అని మనీషా హిందీలో చెప్తుంది. వంట అద్భుతంగా ఉందని మాధవ మెచ్చుకుంటాడు. మాధవ గోరుముద్దలు చేసి మనీషా చేతిలో పెడతాడు.

 

అటు చక్రికి లాయర్ ఫోన్ చేసి.. రేపు హియరింగ్ ఉంది గుర్తుందా అని అడుగుతాడు. నేను రాలేను, బయట ఉన్నా, వాయిదా తీసుకోండి అని చక్రి అంటాడు. ఇప్పుడిప్పుడే మన కుటుంబం అని మహా అంటోంది.. ఇలాంటి టైంలో విడాకులు, కోర్టు అని వెళ్లడం ఎందుకని చక్రి మనసులో అనుకుంటాడు. ఇటు మహాకి కూడా లాయర్ ఫోన్ చేసి.. రేపు రావాలని అనగా మహా కూడా.. నేను రాలేను, ఇంకో డేట్ చూడండి అని చెప్తుంది.

 

ఇంట్లో పెద్ది ఫుల్ జోష్ మీద.. తమ్ముళ్లు కాఫీ తీసుకోండి, పకోడీలు వేస్తానంటూ హుషారుగా ఉంటాడు. చక్రి మాత్రం లాయర్ ఫోన్ గురించే ఆలోచిస్తూ డల్ గా వస్తాడు. చివరకు మహానే.. లాయర్ ఫోన్ చేశాడని చెప్పగా మీకు కూడా చేశాడా అని అంటాడు. నేను రాలేనని చెప్పానని మహా అనగానే చక్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Podharillu, Podharillu Episode 216, Star Maa Serial, Chakri, Maha, Madhav, Manisha, Bhansi, Kanna, Gopika, Divorce Case]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com