
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-119 లో.. సంజయ్ ఇంటికి ఎంతో సంతోషంగా వస్తాడు. ఏంటి ఇంత హుషారుగా ఉన్నావని అడగడంతో మంచి డీల్ కుదిరిందని చెప్తాడు. తన అమ్మమ్మ, తాతయ్యలపై గౌరవంతో తను ఒక అమ్మాయిని చూసుకున్నానని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని సంజయ్ చెప్పడంతో అందరు షాక్ అవుతారు. ఎవరు ఆ అమ్మాయి అని అడగ్గా.. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తాడు. దీంతో జాను, గౌతమిల్లో ఎవరిని సంజయ్ ఇష్టపడ్డాడో అర్థం కాక అందరు ఆలోచనలో పడతారు. మరోవైపు కిన్నెరకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అవడంతో కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు.
ఇక సూర్య పరిస్థితిని చూసి నిత్య బాధపడుతుండగా అక్కడికి వచ్చిన ఆమె తండ్రి సింహాద్రి.. సూర్యను చూసి ఇంకా చావలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. రోడ్లపై అలా తిరిగితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని సింహాద్రి అంటాడు. దీంతో నిత్యకు అనుమానం వచ్చి ఈ పని నువ్వే చేశావు కదా అంటూ తండ్రి కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. తనే సూర్యను చంపాలని చూశానని సింహాద్రి ఒప్పుకుంటాడు. అంతేకాదు, సూర్య తన కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని, అతన్ని వదిలిపెట్టనని అంటాడు. సూర్య గొంతు పట్టుకోబోతే నిత్య అడ్డుకుంటుంది. సూర్యకు జాను అంటే ఇష్టమని, జాను తనను వదిలేసి వెళ్లిపోతుందని సింహాద్రి చెప్పడంతో.. సూర్యను జాను ఇక కలవదని నిత్య అంటుంది. గుడిలో జరిగిన పెళ్లి గురించి చెప్తూ.. సూర్యకు ఈ విషయం తెలియదని, తన ప్రేమతో అతన్ని మార్చుకుంటానని సింహాద్రిని వేడుకుంటుంది నిత్య.
మరోవైపు సంజయ్ జానునే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని శివుడు, పారు మాట్లాడుకుంటారు. త్వరగా పెళ్లి సంబంధం మాట్లాడి ముహూర్తం పెట్టించాలని నిర్ణయించుకుని తాంబూలాలు సిద్ధం చేయిస్తారు. అనంతరం శివుడు, పారు కుటుంబంతో కలిసి జాను ఇంటికి వెళ్లి.. ఇకపై ఇళ్ల సమస్య ఉండదని అందరు తమ ఇంట్లోనే ఉండొచ్చని చెప్తారు. తము ఇక బంధువులు కాబోతున్నామని తమ మనవడు సంజయ్‌కి జానుని పెళ్లి చేయాలని అడగడానికి వచ్చామని చెప్పడంతో జాను కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. తమ అబ్బాయికి ఎప్పటినుంచో పెళ్లి చేయాలని చూస్తున్నామని ఇన్నాళ్లకు జాను నచ్చిందని శివుడు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godhavari, Godhavari Episode 119, Star Maa Serial, Sanjay, Janu, Nithya, Kinnera, Simhadri, Shivudu, Paru]






