
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 1143 లో.....సిరి గదిలో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇందు, రాజు ఇద్దరు వస్తారు. నువ్వు బెడ్ మీద పడుకో నేను కింద పడుకుంటానని రాజు అనగానే సిరి.. నువ్వు కింద పడుకుంటున్నావా, నేను నీ పక్కనే పడుకుంటానని మారాం చేస్తుంది. ముగ్గురం సరిపోమని రాజు చెప్పినా వినకుండా చేయి పట్టుకుని బెడ్ మీదకు లాక్కెళ్తుంది. మొగుడా కథ చెప్పవా అని సిరి అడిగితే రాజు తన నిజ కథనే చెప్తాడు. నాన్న, కూతురు బైక్ పై వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందని చెప్పి గుర్తుందా అని రాజు అడుగుతాడు. అది కథ కదా నాకెందుకు గుర్తుకు వస్తుందని మరో కథ చెప్పించుకుని రాజు కాలు మీదే నిద్రపోతుంది సిరి.
తెల్లారి ఇందు బయటకు వెళ్లగానే సిరి లేచి నేరుగా రాజు పక్కన వెళ్లి చేయి వేసుకుని పడుకుంటుంది. అది చూసిన అపర్ణ.. ఇందూ అని అరుస్తుంది. భ్రమరం వచ్చి.. ఏంటి రాజు మొదటి భార్యతో కలిసి ఉన్నావా అని రెచ్చిపోతుంది. అపర్ణ మాత్రం.. సిరి గతం మర్చిపోయింది, చిన్నపిల్ల మనస్తత్వం, వక్రబుద్ధితో చూడకండి అని ఫైర్ అవుతుంది. ఇకపై సిరి నా గదిలోనే పడుకుంటుందని అపర్ణ తేల్చి చెబుతుంది.
ఇక ఐశ్వర్య హాల్ టికెట్ తో అసలు గొడవ మొదలవుతుంది. ఐశు హాల్ టికెట్ హాల్లో పెట్టి పైకి వెళ్లగానే సిరి దాన్ని పేపర్ అనుకుని పడవ చేసుకుంటుంది. హాల్ టికెట్ పోయిందని ఐశు అందరిని నిలదీస్తే భ్రమరం.. ఇందు, రాజులే తీసి ఉంటారు.. నువ్వు పాస్ అయితే కంపెనీ పెట్టివ్వాలని చింపేసి ఉంటారని నింద వేస్తుంది. రాజు, ఐశు గొడవపడుతుండగా సిరి.. తీశానని పడవ ఇవ్వడంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Brahmamudi, Brahmamudi Episode 1143, Star Maa Serial, Raju, Indu, Siri, Aparna, Bhramaramba, Aishwarya, Hall Ticket]






