
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 213 లో... నేను నా తమ్ముళ్లకు అడ్డుగా ఉన్నాను భన్సీ.. నా వల్లే వాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారని పెద్ది బాధపడుతుంటాడు. నువ్వు వాళ్ల గురించి ఆలోచిస్తున్నావ్..వాళ్లు నీ గురించి ఆలోచిస్తున్నారు.. అయినా ఈ సంబంధం మాకెవ్వరికీ నచ్చలేదు భాయ్ అని చెప్తాడు. ఇంతలో సిగ్గుపడుతూ టీ తీసుకొస్తుంది మనీషా. భన్సీకి తన చెల్లి కళ్లలో ప్రేమ అర్థమవుతుంది. వెంటనే.. భాయ్ ఏం అనుకోనంటే ఒక మాట అడుగుతా, మా మనీషాని పెళ్లి చేసుకుంటారా అని పెద్దిని డైరెక్ట్ గా అడిగేస్తాడు. ఆ మాటతో మనీషా టెన్షన్ పడుతుంది. అలా అడగడం కాదు, మనీషా మనసులో ఏముందో తెలుసుకోవాలని పెద్ది అంటాడు. మా చెల్లి కళ్లలో మా బావ మీద కోపం, నీ మీద ప్రేమ చూశాను.. మీ కుటుంబంలో పడితే అందరిని బాగా చూసుకుంటుందని భన్సీ చెప్తాడు. చివరికి ఇద్దరినీ వదిలేసి భన్సీ సైడ్ అయిపోతాడు. నీకు ఇష్టమేనా అని మనీషాని పెద్ది అడుగుతాడు. ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలలు ఊపుకుంటూ ప్రేమను చెప్పుకుంటారు.
మనీషా ప్రేమలో పడిన పెద్ది పూర్తిగా పరధ్యానంలోకి వెళ్లిపోతాడు. రోడ్డుపై సైకిల్ తొక్కుతూ కూడా ఆమె ధ్యాసలోనే ఉండి ఎదురుగా వస్తున్న బైక్ ని చూసుకోకుండా ఢీకొడతాడు. సారీ అండి అని బైక్ వాడు అంటే పర్లేదని నవ్వుతూ వెళ్లిపోతాడు పెద్ది. ఇంటికి వచ్చాక కూడా అలానే ఉంటాడు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా నవ్వుతూ సమాధానం చెప్తాడు.. అన్నం పెట్టకముందే ప్లేట్ తీసుకుని తింటాడు. కూర వేయకుండానే పెరుగు వేసుకుని.. కూర బాగుంది తినండి అంటాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు ఇలా అయిపోయాడా.. వీడికి ఏదో అయిందని షాక్ అవుతారు. నారాయణ మందు కొడుతూ.. ఓ పెగ్గు వేస్తావా అని అడిగితే వద్దు నాన్నా నిద్ర వస్తుందని పెద్ది అనడంతో.. వీడికి మతి చెడిందా ఏంటని నారాయణ కూడా షాక్ అవుతాడు.
మరోవైపు కేశవ, శైలుల మధ్య గొడవ నడుస్తోంది. శైలు చేసిన పనిని గుర్తుచేసుకుని కేశవ కోపంతో రగిలిపోతాడు. శైలు ఫోన్ చేసినా కట్ చేస్తాడు. నువ్వు తిట్టేసి వెళ్లిపోమని చెప్పి సారీ కూడా చెప్పవా అని శైలు అడిగితే..మన పెళ్లి కోసం ఆయన్ని పెళ్లి చేసుకోమని చెప్పడం తప్పని కేశవ అంటాడు. ఎప్పుడూ మీ వాళ్ల గురించే ఆలోచిస్తావా, మా వాళ్లు నీ గురించి ఏమంటున్నారో తెలుసా అని శైలు ఏడవడంతో.. ఇప్పుడు కూడా సారీ చెప్పకుండా మీ వాళ్ల గురించే చెప్తావా అని కేశవ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇంట్లో మహా మాత్రం చక్రిని రూమ్ లోకి పిలుస్తుంది. ఏంటి నన్నేనా అని చక్రి షాక్ అవుతూ బాడీ స్ప్రే కొట్టుకుని ఓవర్ చేస్తుంటే మహా కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Podharillu, Podharillu Episode 213, Star Maa Serial, Peddi, Manisha, Bhansi, Narayana, Keshav, Shailu, Chakri, Maha]





(2).webp)
