(2).webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -116 లో..... జాను చెల్లి ఆపరేషన్ కి డబ్బు కావాలని తిరుగుతుంటే సంజయ్ వచ్చి.. మీ చెల్లి ఆపరేషన్ కి డబ్బు నేను ఇస్తానని అంటాడు. జాను హ్యాపీగా.. కొంచెం కొంచెంగా తిరిగి ఇచ్చేస్తానంటే అవసరం లేదు.. కానీ నాది ఒక కండిషన్ ఉందని సంజయ్ అంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని సంజయ్ అనగానే జాను షాక్ అవుతుంది. నేనేం నీ అందం చూసి ప్రేమతో అడగట్లేదు.. నీకు డబ్బు అవసరం.. నాకు ఒక అవసరం ఉంది. ఇద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకుందాం.. కొన్నాళ్ల తర్వాత విడిపోదాం, అగ్రిమెంట్ కూడా రాసుకుందామని సంజయ్ చెప్పేసరికి .. ఒక అమ్మాయితో ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదా అని తిట్టి.. షటప్ అని చెప్పి వెళ్లిపోతుంది. దూరం నుంచి ఇదంతా చూసిన పారు, శివుడు ఏం జరిగిందని అడిగితే, నిజం చెప్తే మళ్లీ సంజయ్ దగ్గరికే వెళ్తారని భయపడి.. మా ఊరి విషయాలు అడిగాడని కవర్ చేస్తుంది, వాడు కోపిష్టే కానీ మంచోడు అని పారు అనగానే మళ్లీ.. చాలా మంచోడు అని మాట మార్చేస్తుంది జానూ.
మరోవైపు డబ్బు కోసం జాను ఆస్పత్రిలో నానా తిప్పలు పడుతుంది. డబ్బు కట్టమంటున్నారు జాను అని నందు అంటే వచ్చేస్తుందిలే అని ధైర్యం చెప్పి క్యారేజ్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ నర్సు.. త్వరగా డబ్బు కట్టండి అంటూ ప్రెజర్ పెడుతుంది. జాను డాక్టర్ దగ్గరకు వెళ్లి.. ట్రస్ట్ ద్వారా ఆపరేషన్ చేయండి, 30 నుంచి 50 లక్షలు కావాలి, రేపే ఆపరేషన్ అని బతిమాలుతుంది. కానీ డాక్టర్.. ట్రస్ట్ ప్రాసెస్ కి నెలా రెండు నెలలు పడుతుంది. రేపటికి రేపు డబ్బులు ఇవ్వరు.. చాలా ఎంక్వైరీ చేస్తారని చెప్పి పంపేస్తాడు. ఇంట్లో కూడా గొడవే. మురళీ తినడానికి కూర్చుంటే నందు వచ్చి.. అక్కడ కిన్నెరకు డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తామని అంటున్నారు. నీ మాట మీద నమ్మకం లేదు బావా.. బ్యాంక్ అకౌంట్ లో చెక్ వేయొద్దు అన్నాను.. ఆ జాను నువ్వు వినలేదంటూ తిట్టడంతో మురళీ చేయి కడుక్కుని లేచి వెళ్లిపోతాడు.
చివరికి డబ్బు ఎక్కడా దొరకక కిన్నెర దగ్గరకు జాను వచ్చి కుప్పకూలిపోతుంది. అక్కా నన్ను ఇక్కడే వదిలేస్తావా.. ఇంటికి తీసుకెళ్లవా అని అడిగినట్లు భ్రమపడి బోరున ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godhavari, Godhavari Episode 116, Star Maa Serial, Janu, Sanjay, Kinnera, Nandu, Murali, Paru, Shivudu, Agreement Marriage]






