
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 583 లో.....భద్రావతి ఇంట్లో పెళ్లిచూపులు అని తెలియగానే ధీరజ్ రగిలిపోతాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా నేరుగా భద్రావతి ఇంట్లోకి దూరి హంగామా చేస్తాడు. బంధువుల ముందే ఇంట్లో సామాన్లు చిందరవందర చేసి, అడ్డొచ్చిన ప్రేమపై, భద్రావతిపై చేయి లేపబోతాడు. పెళ్లి చూపులు అనగానే ఎగేసుకుని వస్తారా అంటూ బంధువులను బెదిరిస్తాడు. ప్రేమ కోపంగా.. ఇంకో క్షణం ఇక్కడ ఉంటే మర్యాదగా ఉండదంటూ ధీరజ్ కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చి రామరాజు మీదకు తోసేస్తుంది. అది చూసి వల్లి తెగ సంబరపడిపోతుంది. ఇది కలా నిజమా అంటూ రామరాజు, వేదవతిని పిలుస్తుంది.
అసలు గొడవకు కారణం ధీరజ్ అపార్థం. ప్రేమకు పెళ్లి చూపులు అనుకున్నాడు కానీ అవి విశ్వకి ఏర్పాటు చేసినవి అని తెలుసుకోలేదు. విశ్వా.. అయ్యా అది కాదు బావా అని చెప్పబోతున్నా వినడు. రామరాజు అయితే మరింత రెచ్చిపోయి.. నా కోడలికే పెళ్లి చూపులా అంటూ సేనాపతిని పొట్టు పొట్టుగా కొడతాడు. దీంతో భద్రావతి.. నా ఇంటికే వచ్చి నా కోడలినే, తమ్ముడినే కొడతారా, ఒక్క ఫోన్ చేస్తే పోలీసులు వస్తారని అంటుంది. వేదవతి..మీరే నా కోడలికి పెళ్లి చూపులు పెడితే ఏం చేయాలని ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు. ఇద్దరు బస్తాలకు బస్తాలు కంప్లైంట్ రాసి ఇవ్వడంతో కానిస్టేబుల్.. పాతికేళ్ల గొడవల నుంచి మొదలుపెట్టారు సర్.. కళ్లల్లో నీళ్లు, చేతుల్లో నొప్పులు వస్తున్నాయని ఏడుస్తాడు. ఎస్సై గెటప్ లో జబర్దస్త్ అప్పారావు ఎంట్రీ ఇస్తాడు.
మరోవైపు ప్రేమ, ధీరజ్ విడిపోవడం వెనుక వల్లి ఉందని ఆధారాలు దొరికాయి కానీ దాని వెనుక ఉన్న పెద్ద తిమింగలం భద్రావతి అని తన ఫ్రెండ్ తో చెప్తుంది. పాతికేళ్ల పగను పక్కనపెట్టి మా ఇంట్లో శారదాంబ బర్త్ డే చేస్తాననగానే డౌట్ వచ్చింది. అప్పుడే ప్రేమ, ధీరజ్ ని విడగొట్టాలని ప్లాన్ చేసిందని అర్థమైంది కానీ వల్లి నుంచి భద్రావతికి ఒక్క కాల్ డేటా కూడా లేదు.. అదే మిస్టరీ అంటుంది. స్మిత ఎవిడెన్స్ వెతికే పనిలో ఉందని చెప్తుండగానే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. నర్మద అక్కడికి వెళ్లి.. ఏంట్రీ ప్రేమ, ఏమైందని అడిగినా ఎవరు చెప్పరు..చందు మొత్తం చెప్తాడు. చివరికి కుటుంబరావు అనే ఎస్సై.. రెండు కుటుంబాలను అరెస్ట్ చేస్తే ఐదేళ్లు జైల్లో ఉండాలి.. నేను కుటుంబాలను కలిపేవాడిని, విడగొట్టేవాడిని కాదు..బయటకు వెళ్లి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి అని ఛాన్స్ ఇస్తాడు. ధీరజ్ కి భార్య అంటే ఎంత ప్రేమో చూడండి అని విశ్వ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. వాడు మారడని నీ నమ్మకం తప్పని తేలింది కదా.. నువ్వు ఇచ్చిన మాట గుర్తుందా అని ప్రేమతో భద్రవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu, Illu Illalu Pillalu Episode 583, Star Maa Serial, Dheeraj, Prema, Bhadravathi, Vishwa, Senapathi, Ramarao, Vedavathi, Valli, Narmada]






