Home

»

Tv News

Podarillu : పెళ్లి ఆగిపోవడంతో రగిలిపోయిన పెద్ది.. శైలు ఏం చేయనుంది!

Sep 18, 2026 9:28AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 212 లో.. నారాయణ, చక్రి, కేశవ మీద పెద్ది కోప్పడతారు. నేను నా గురించి బాధపడటం లేదు. నేను పెళ్లి చేసుకోకపోతే మిగతా వాళ్లు కూడా అలానే ఉండిపోతారని బాధపడుతున్నాను.. ఇక మనం ఎప్పటికీ ఇలానే బ్రహ్మచారుల్లా ఉండిపోదాం..‌సన్యాసుల మఠంలా మార్చేద్దామని ఫైర్ అవుతాడు. అదే సమయంలో చక్రి ఇచ్చిన సలహాతో శేఖర్ తన భార్య జయంతిని కాళ్లు పట్టుకొని మరీ ఒప్పించి ఇద్దరూ ఒక్కటవుతారు. దీంతో శేఖర్ వచ్చి.. నువ్వే నా పాలిట దేవుడు, నువ్వు మహాత్ముడివి.. నీ సలహాతోనే నా జీవితం నిలబడిందంటూ చక్రికి థాంక్స్ చెప్తాడు. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలని చక్రి అనడంతో.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మై సన్ అని నారాయణ అంటాడు. పెద్ది మాత్రం కోపంగా చూస్తాడు.

 

మీరంతా కోరుకున్నట్లు, ప్లాన్ చేసినట్లుగానే నా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా, మీ అందరికీ సంతోషమేనా.. వీధిలో వారందరికి చెప్పండి. తాయారు అత్త శాపం ఫలించిందని అంటూ పెద్ది అందరి మీద అరుస్తాడు. ఎవరికి ఎవరితో పెళ్లి జరగాలి.. ఎవరు విడిపోవాలని ముందే రాసి ఉంటుందని నారాయణ సర్ది చెప్పబోతే చక్రి ముందుకొచ్చి.. అవును ఇదంతా చేసింది నేనే..  ఈ గ్యాంగ్ కి లీడర్ నేనే.. ఆ జయంతిని నువ్వు చేసుకోవడం మాకు నచ్చలేదు.. మీ ఇద్దరిని విడగొట్టి ఆ ఇద్దరిని కలిపాను.. నిజాన్ని నిజాయితీగా చెప్పడానికి ధైర్యం ఉండాలి.. నాకుందని ధైర్యంగా చెప్తాడు. దీనికి కేశవ కూడా సపోర్ట్ గా.. శైలు ఏదో అనేసిందని నువ్వు పెళ్లికి రెడీ అవుతావా..  జాతకాలు బాగా లేవని బయటకు వెళ్లావ్.. నువ్వు లేకపోతే మేం ఉండలేమని ఆ రోజే చెప్పాం కదా అని అంటాడు. ఈ జయంతి తన భర్తను కాళ్లబేరానికి తీసుకురావడానికి నిన్ను పావులా వాడుకుంది..‌ఈ ఎంగేజ్మెంట్ ని వేదికగా చేసుకుంది.‌ ఈ పెళ్లి తప్పినందుకు సంతోషంగా ఉండురా అని పెద్దితో నారాయణ అంటాడు

 

మరోవైపు కేశవ మాటల్ని తల్చుకుంటూ శైలు రూంలో గడియ పెట్టుకొని బాధపడుతుంటే వరాలు, సురేష్ దీన్నే ఛాన్స్ గా తీసుకొని ఆమెను బ్రెయిన్ వాష్ చేయాలని ప్లాన్ చేస్తారు. శైలు కేశవకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడంతో కోపం తెచ్చుకుంటుంది.. అదే టైంలో వరాలు.. ఏమైందే నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? నిన్ను తిట్టాడా? నువ్వే కదా వెంటపడి లవ్ చేశావ్.. నువ్వంటే వాడికి అలుసు..‌ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లయ్యాక ఎలా చూస్తాడో అంటూ ఎక్కిస్తుంది. సురేష్ కూడా.. దీన్ని వంటింటి కుందేలుగా మార్చేస్తాడంటూ రెచ్చగొడతాడు. ఇంకోసారి ఆలోచించుకో, వాడ్ని మర్చిపోమని చెప్పబోతే.. మీరు ముందు ఈ రూంలోంచి వెళ్లిపోండి అని శైలు కోపంగా అంటుంది. ఇంకోవైపు పెద్ది కోపంతో భన్సీ ఇంటికి వెళ్తాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Podharillu, Podharillu Episode 212, Star Maa Serial, Narayana, Chakri, Peddi, Keshav, Jayanti, Shekhar, Shailu, Varalu]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com